చాలా మందికి సినిమాల్లో బాలకృష్ణ సీరియస్ హీరోగానే తెలసు. ఎంత సీరియస్ షూటింగ్ లో అయినా బాలయ్య ఎంత సరదాగా ఉంటాడో తెలిసేలా.. మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు వీరసింహారెడ్డీ టీమ్. 

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ మూవీ నుంచి వరుస అప్ డేట్స్ ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్. అభిమానులు ఉర్రూతలూగేలా ప్లాన్ చేస్తున్నారు టీమ్. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సుగుణ సుందరి సాంగ్‌ సోషల్ మీడియాల్ ట్రెండింగ్ లో ఉంది. భారీగా వ్యూస్ సాధిస్తూ..టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. టార్కీలోని అందమైన లొకేషన్లలో షూట్ చేసిన ఈ డ్యూయెట్ సాంగ్‌ ను స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్‌ మాస్టర్ కంపోజ్‌ చేయగా.. అంతే స్టైలిష్ డ్యాన్స్ తో బాలయ్య, శ్రుతి హాసన్ అదరగొట్టేశారు.ఇక ఈ సాంగ్‌ మేకింగ్‌ విజువల్స్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్ టీం.

టర్కీలోని షూట్ చేసిన సుగుణ సుందరి పాట ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యింది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈపాటను రామ్‌ మిర్యాల, స్నిగ్ధ శర్మ పాడారు. ఎస్‌ థమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ అని చెప్పాలి. అంతే కాదు అఖండాకు ఎంత మనసు పెట్టి మ్యూజిక్ ఇచ్చాడు. అంతకు రెట్టింపు అవుట్ పుట్ కోసం కష్టపడ్డాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ పాటకు మరో స్థాయికి తీసుకెళ్లింది. మరోవైపు వీరసింహారెడ్డి నుంచి విడుదలైన జై బాలయ్య మాస్ ఆంథెమ్‌ సాంగ్‌కు కూడా అద్బుతమైన స్పందన వస్తోంది. గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్న ఈమూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Scroll to load tweet…

జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది వీరసింహారెడ్డి. మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో శృతిహాసన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీ రోల్ పోషిస్తుండగా.. హనీ రోజ్‌, చంద్రికా రవి, పీ రవిశంకర్, ధునియా విజయ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.