గత నాలుగైదు రోజులుగా క్రిష్ కు, బాలయ్యకు మధ్య చెడిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, అసలు బయోపిక్ రెండు పార్ట్ లుగా తీయచ్చు అనే ఐడియా ఇచ్చి చెడకొట్టాడని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై మీడియా వద్ద అసలు నిజాలు బయిటపెట్టారు క్రిష్. తమ తాజా చిత్రం మహానాయకుడు ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు పార్ట్ లుగా తీయాలనే ఆలచన, ప్రపోజల్ బాలయ్యదే అని తేల్చారు. 

క్రిష్ మాట్లాడుతూ.. ''నేను ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్టులోకి వచ్చేసరికే రెండు పార్ట్ లుగా సినిమా చెయ్యాలనే ఆలోచన ఉంది. బాలయ్య గారు నాకు ఆ విషయం చెప్పటంతో ఓకే అన్నాను. సినిమా జీవితం ఓ పార్ట్..పొలిటికల్ లైఫ్ రెండో పార్ట్ గాచూపుదామని చెప్పారు. నేను సరే అని సినిమా చేసాను'' అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే బయట సినిమాలో నలభై శాతం.. బాలకృష్ణే డైరక్ట్ చేసారన్న దానికి స్పందిస్తూ.. అలాంటిదేమీ జరగలేదని, బాలయ్య దర్శకుడు విషయంలో వేలు పెట్టే మనిషి కాదని అన్నారు.

అంతేకాకుండా.. తనకు బాలయ్యకు విభేధాలు ఏమీ రాలేదని, అసలు ఇలాంటి రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తారో అర్దం కాదని అన్నారు. ఇప్పటికి ఇద్దరం మంచి స్నేహితులం అన్నారు. ఖచ్చితంగా రెండో పార్టి విజయం సాధిస్తుందన నమ్మకం వ్యక్తం చేసారు.