Asianet News TeluguAsianet News Telugu

వైరల్ : 'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా?' ..స్టేజీపై బాలయ్య ఇండైరక్ట్ గా హింట్

 గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని మోక్షజ్ఞ నన్నే అన్నాడు.. ఇంట్లో నేను కుర్ర హీరోని రావడానికి రెడీగా ఉన్నా.. నువ్ ఆమెతో చేస్తాను అంటావా?

Balakrishna Speech at Bhagavanth Kesari trailer launch viral jsp
Author
First Published Oct 9, 2023, 6:41 AM IST

బాలయ్య  హీరోగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు ‘భగవంత్ కేసరి’.ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై రూపొందిన  ఈ చిత్రాన్ని సాహు గరపాటి, హరీష్ పెద్ది లు నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్, బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. విలన్ గా నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రామ్ పాల్ నటిస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ట్రైలర్‌ను  రాత్రి  విడుదల చేసారు. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో ఈవెంట్‌ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శకులు గోపీచంద్‌ మలినేని, బాబీ, వంశీ పైడిపల్లి హాజరయ్యారు. ట్రైలర్‌ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ బాలయ్య మాట్లాడిన స్పీచ్ సైతం ఇప్పుడు వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ స్పీచులో  శీలీల, మోక్షజ్ఞలపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

బాలయ్య మాట్లాడుతూ... శ్రీలీల ఈ సినిమాలో ప్రతీ సారి నన్ను చిచ్చా అని పిలుస్తూ ఉండేది.. చిచ్చా అంటే పగిలిపోద్ది’ అంటూ బాలయ్య స్టేజ్ మీద సైగలు చేశాడు. శ్రీలీల దగ్గరకు వెళ్లి బాలయ్య వార్నింగ్ ఇచ్చినట్టుగా ఫన్నీగా అన్నాడు.. ‘శ్రీలీలతో నెక్ట్స్ హీరోయిన్‌గా చేద్దామని అనుకున్నా.. ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పా.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని మోక్షజ్ఞ నన్నే అన్నాడు.. ఇంట్లో నేను కుర్ర హీరోని రావడానికి రెడీగా ఉన్నా.. నువ్ ఆమెతో చేస్తాను అంటావా? అని నాకే వాడు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పుకొచ్చారు. మోక్షజ్ఞ లాంచింగ్ విషయమై హింట్ ఇచ్చారని అభిమానులుకు అర్దమైంది. 

ఇక ‘ఇప్పటి వరకు భగవంత్ కేసరి నుంచి మీరేం చూడలేదు.. మీరు చూసింది చాలా తక్కువ.. ఇంకా చాలా దాచాం.. గుప్పెట్లో దాచి పెట్టినట్టుగా ఉంచాం.. అంచలంచెలుగా చూపిస్తాం.. సినిమా చూస్తే అభిమానుల్ని ఆపలేం.. దసరాకు దంచుదాం.. నాకు సవాళ్లు తీసుకోవడం అలవాటు.. అది మా నాన్న గారి నుంచి వచ్చింది.. ఇప్పుడు నేను బాబీతో సినిమా చేస్తున్నా.. కథ కూడా ఫైనలైజ్ అయింది.. నేను ఎప్పుడూ గత సినిమాల గురించి చర్చించను.. అందరూ కలిసి సమష్టిగా కలిసి పని చేస్తేనే సినిమా వస్తుంది..
 
 అలాగే తమన్ గురించి చెప్పేది ఏముంది.. నా సినిమా అంటే పూనకం.. ఆయన కొడితే థియేటర్లో బాక్సులు పగిలిపోతాయ్.. కొన్ని సార్లు థియేటర్లో సౌండ్ పెంచేందుకు పర్మిషన్ ఇవ్వరు.. కానీ నా ఫ్యాన్స్ మాత్రం ఊరుకుంటారా? థియేటర్లు తగలపెట్టేస్తారు.. అఖండకు ప్రభుత్వాలు సహకరించలేదు.. కరోనా సమయంలో రేట్లు పెంచలేదు..కానీ జనాలు థియేటర్లకు వచ్చారు.. ఆ సినిమా సంచలనాలు సృష్టించింది’ అన్నారు బాలయ్య. 

దర్శకుడు అనిల్ రావిపూడి గురించి చెప్తూ... మొదటి సినిమా పటాస్‌తోనే హిట్టు కొట్టేశాడు.. అందులో నా రౌడీ ఇన్‌స్పెక్టర్ సినిమాలో సీన్స్ నాకు చెప్పకుండా కాపీ కొట్టి వాడేశాడు.. నాతో  సినిమాని కామెడీగా తీయాలా? సీరియస్‌గా తీయాలా? అని అనుకుంటూ ఉండేవాడు.. నేను కూడా కామెడీ కింగ్‌నే.. కామెడీ సినిమా కూడా తీద్దామని అన్నాడు.. సినిమాలో వేసిన పాత్రల నుంచి నటీనటులు బయటకు రావడం లేదు.. అంతగా లీనం అయి నటించారు.. నవ్వుతూ కనిపించే వారికంటే నాలా కోప్పడేవారే మంచివాళ్లు.. ఎందుకంటే కడుపులో ఏం దాచుకోకుండా కక్కేస్తారు అన్నారు.

ట్రైలర్  2 నిమిషాల 51 సెకన్ల నిడివి కలిగి ఉంది. తన కూతురిని ఆర్మీకి పంపాలి అనే ఆశయం కలిగిన తండ్రిగా బాలకృష్ణ, ఆర్మీకి వెళ్లడం ఇష్టం లేని కూతురిగా శ్రీలీల కనిపిస్తుంది. తర్వాత యాక్షన్ సన్నివేశాలు వరుసగా వచ్చాయి. అసలు విలన్ కి బాలకృష్ణ, శ్రీలీలకి సంబందం ఏంటి అనే సస్పెన్స్ మెయిన్టైన్ చేస్తూ ట్రైలర్ సాగింది.

Follow Us:
Download App:
  • android
  • ios