బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్ మోక్షజ్ఞ అరంగేట్రం కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞ వెండి తెరపై వెలిగిపోవాలని ఆశపడుతున్నారు. మోక్షజ్ఞ టీనేజ్ పూర్తి అయినప్పటి నుండీ ఈ డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పుడు మోక్షజ్ఞ వయసు 25 దాటేసింది. అంటే ఈ వయసుకి మోక్షజ్ఞ కనీసం నాలుగైదు సినిమాలు చేయాల్సివుంది. తండ్రి బాలయ్య టీనేజ్ లోనే వెండితెరకు పరిచయం కాగా, బాబాయ్ ఎన్టీఆర్ 19ఏళ్లకే స్టార్ హీరో అయ్యాడు. అలాంటి హిస్టరీ ఉన్న నందమూరి ఫ్యామిలీలో పుట్టిన మోక్షజ్ఞకు సినిమా గాలి లేకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. 

బాలయ్య ఎంతగా మోక్షజ్ఞ మనసు మార్చాలని ప్రయత్నాలు చేసినా.. మాట వినడం లేదు. చివరకు మోక్షజ్ఞ మనసు మారి, హీరోగా మారాలని యజ్ఞయాగాదులు కూడా చేయిస్తున్నాడు. ఇక నందమూరి ఫ్యాన్స్ ప్రతి ఏడాది మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయినా మోక్షజ్ఞలో మార్పు అయితే రావడం లేదు. మోక్షజ్ఞకు సినిమా హీరో అవ్వాలని లేదు అనడానికి అతని పిజిక్కే నిదర్శనం. 

మోక్షజ్ఞ అసలు ఫిట్నెస్ పై శ్రద్ద తీసుకోరు. స్టార్స్ వారసులందరూ సిక్స్ ప్యాక్ బాడీలు మైంటైన్ చేస్తుంటే... మోక్షజ్ఞ కనీసం పొట్టరాకుండా చూసుకోవాలనే నియమం కూడా పాటించడం లేదు. ఆ మధ్య పూర్తిగా షేప్ అవుట్ బాడీలో కనిపించిన మోక్షజ్ఞ అందరికీ షాక్ ఇచ్చారు. భారీగా పెరిగిన పొట్ట, లూజు శరీరంలో ఆయన్ని చూసిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.  చాలా కాలం తరువాత మోక్షజ్ఞ అన్నయ్య చైతన్య కృష్ణ వివాహ వేడుకలో కనిపించారు. మునుపటితో పోల్చుకుంటే మోక్షజ్ఞ లుక్ కొంచెం బెటర్ గా ఉంది. మరి బాలయ్య చెబుతున్నట్లు, 2021లో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.