Asianet News TeluguAsianet News Telugu

ముఖ్యమంత్రిగా బాలయ్య..?

నందమూరి బాలకృష్ణని ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. 

balakrishna's role in boyapati srinu film
Author
Hyderabad, First Published Jan 31, 2019, 11:37 AM IST

నందమూరి బాలకృష్ణని ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు.

ఇటీవల ఎన్టీఆర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే బాలయ్యతో 'సింహా', 'లెజెండ్' సినిమాలను రూపొందించిన బోయపాటి మరో పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో సినిమా తీయబోతున్నాడు. ఈ సినిమాలో బాలయ్య కోసం రెండు పాత్రలు డిజైన్ చేశాడట బోయపాటి.

అందులో ఒకటి ముఖ్యమంత్రి పాత్ర అని సమాచారం. అయితే ఈ సినిమా కంటే ముందుగానే బాలయ్యని ముఖ్యమంత్రి పాత్రలో చూడబోతున్నారు ఆయన అభిమానులు. ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు'లో నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు.

అంటే ఆడియన్స్ కి బోయపాటి సినిమాలో బాలయ్య పాత్ర పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లా అనిపించకపోవచ్చు. కానీ బోయపాటి ఎంత పవర్ ఫుల్ గా ఆ రోల్ డిజైన్ చేశాడో చూడాలి. ఫిబ్రవరి మూడో వారంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios