`అఖండ` ఇచ్చిన ఉత్సాహంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు బాలయ్య. యంగ్ ఏజ్‌లో కూడా చేయలేనటువంటి విధంగా ఓ వైపు టీవీ షోస్‌ మరోవైపు సినిమాలు చేస్తున్నారు. బాలకృష్ణ అందుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

బాలకృష్ణ(Balakrishna) చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్‌ అందుకున్నాడు. `గౌతమిపుత్రశాతకర్ణి` మినహాయిస్తే.. `లెజెండ్‌` తర్వాత ఆయనకు సరైన హిట్‌ దక్కలేదు. వరుసగా పరాజయాలు వెంటాడాయి. దీంతో బాలయ్య అభిమానులు సైతం ఎంతో నిరాశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ సెట్‌ అయ్యింది. హ్యాట్రిక్‌ బ్లాక్‌ బస్టర్‌ పడింది. డిసెంబర్‌ 2న విడుదలైన `అఖండ`(Akhanda) చిత్రం సంచలన విజయం సాధించింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇది ఏకంగా రూ.115 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాల టాక్‌. 

అయితే Akhanda ఇచ్చిన ఉత్సాహంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు బాలయ్య. యంగ్ ఏజ్‌లో కూడా చేయలేనటువంటి విధంగా ఓ వైపు టీవీ షోస్‌ మరోవైపు సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన `ఆహా`లో `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` టాక్‌ షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాల పరంగానూ దూకుడు పెంచాడు బాలయ్య. ప్రస్తుతం ఆయన `క్రాక్‌` ఫేమ్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో `ఎన్‌బీకే107`(NBK107) చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాలో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌, దునియా విజయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతుందని తెలుస్తుంది. 

ఈ చిత్రానికి బాలకృష్ణ అందుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ చిత్రానికిగానూ బాలయ్య ఏకంగా ఇరవై కోట్ల వరకు అందుకోబోతున్నాడనే టాక్‌ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. `అఖండ` చిత్రానికి ముందు బాలయ్య కేవలం ఐదారు కోట్లలోపే అందుకున్నారు. కానీ `అఖండ` సక్సెస్‌తో పది కోట్ల వరకు ఇచ్చారని తెలుస్తుంది. అయితే కొత్తగా నటించబోతున్న సినిమాలకు బాలయ్య పారితోషికం పెంచారని, డబుల్‌ చేశారని టాక్‌ నడుస్తుంది. 

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే NBK 107 చిత్రానికిగానూ ఏకంగా 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు అందుకుంటున్నారని చర్చ నడుస్తుంది. `అఖండ`కి డబుల్‌ పారితోషికం అందుకోబోతున్నాడనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. `అఖండ` చిత్రంతో బాలయ్య మార్కెట్‌ కూడా పెరిగింది. కేవలం యాభై కోట్లతో రూపొందిన `అఖండ` వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిందంటే మామూలు విషయం కాదు, బాలయ్య స్థామినా ఏంటో చూపించింది. ఈ నేపథ్యంలో నెక్ట్స్ సినిమాలను పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించేందుకు ప్లాన్‌ జరుగుతుందని, అందులో భాగంగా బాలయ్య పారితోషికం కూడా బాగానే ఇస్తున్నట్టు సమాచారం. 

బాలకృష్ణ.. గోపీచంద్‌ చిత్రంతోపాటు అనిల్‌ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నారు. వీరిద్దరికి ఇప్పటికే కమిట్మెంట్‌ ఉంది. మరి అది గోపీచంద్‌ తర్వాతనే తెరకెక్కుతుందా? టైమ్‌ పడుతుందా? అన్నది చూడాలి. వీటితోపాటు మరో రెండు ప్రాజెక్ట్ లకు బాలయ్య కమిట్‌ అయ్యారని టాక్‌. ఇదిలా ఉంటే బాలయ్య తన `అన్‌స్టాపబుల్‌`టాక్‌ షోకి కూడా పారితోషికం పెంచాడని టాక్‌. ప్రస్తుతం ఆయన ఒక్కో ఎపిసోడ్‌కి 25 లక్షలు తీసుకునేవారని, ఇప్పుడు 40లక్షలు చేశారని తెలుస్తుంది.