ప్లోర్ మూమెంట్ కు రెడీ అవుతున్న బాలకృష్ణ, అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా..?
తన అభిమానులను అలరించడానికి ఏ సాహసం చేయడానికైనా సై అంటున్నాబు బాలయ్య.. వయస్సుతో సబంధం లేకుడా.. కుర్రాళ్లకు పోటీ ఇస్తూ.. ఉరకలు వేస్తున్నాడు బాలకృష్ణ. ఇక ఈసారి మరింత సాహసం చేయడానికి సై అంటున్నట్టు తెలుస్తోంది.

నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి జోరు మీద ఉన్నాడు. వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు. 60 ఏళ్ల వయస్సులో.. 20 ఏళ్ల కుర్రాడిలా జోరు చూపిస్తున్నాడు. ఒకవైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాలు ఇంకో వైపు క్యాన్సర్ హాస్పిటల్ అంటూ బిజీ బిజీగా వ్యావహరిస్తున్నాడు బాలయ్య బాబు. ఈ ఏజ్ లో కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు బాలయ్య బాబు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. బాలయ్య – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి...I Don’t Care ట్యాగ్ లైన్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన మొదటి సారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక భగవంత్ కేసరి సినిమా గురించిన క్రేజీ న్యూస్ ఒకటి మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా గురించి వినిపిస్తోన్న లేటెస్ట్ హాట్ న్యూస్ ఏంటీ అంటే.. ఈ సినిమా కోసం బాలయ్య ఓ సాహసం చేయబోతున్నారట. బాలయ్య సినిమా అంటే పాటలు లేకుండా ఉండదు. ఈ ఏజ్ లో కూడా ఆయన కుర్ర హీరోలతో పాటు పోటీ పడుతూ స్టెప్పుటేస్తారు. లక్ష్మీ నరసింహ, లెజంట్, అఖండ లాంటి సినిమాల్లో ఆయన ఊపు తెలిసిందే.. ఈ క్రమంలో ఈసారి కూడా భగవంత్ కేసరి సినిమాలో డాన్స్ వేరే లెవల్లో ఉండబోతోందట. ఈసారి బాలయ్య ఫ్యాన్స్‌ని ఖుషీ చెయ్యడానికి సాంగ్స్‌ని భారీగా డిజైన్ చేస్తున్నారట.
‘భగవంత్ కేసరి’ మూవీలో ఓ పాటలో బాలయ్య చేత ఏకంగా ఫ్లోర్ స్టెప్ వేయించాలనుకున్నాడట డైరెక్టర్. బాలయ్యకి తన ఆలోచన చెప్పడం, ఆయన వెంటనే ఒకే అనేసి.. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. అంతే కాదు 10 రోజుల పాటు ప్రాక్టీస్ చేయడం కూడా జరిగిందట. ‘బాలయ్య ఫ్లోర్ మూమెంట్ వేస్తే ఎలా ఉంటుంది?, థియేటర్లు దద్దరిల్లిపోతాయ్.. జస్ట్ ఇమాజిన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.
ఈసినిమాలో ప్రస్తుతం టాలీవుడ్ లో టపాసులా పేలుతున్న హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తోంది. బాలయ్య బాబు కూతురు పాత్ర చేస్తోంది అనేది టాక్. మరి ఆమె పాత్రపై ఇంత వరకూ క్లారిటీ లేదు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈసినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ఆమధ్య బాలయ్య బార్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై అంచనాలు పెంచేసింది. తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ తో అదరగొట్టేశారు. బాచుపల్లిలో వేసిన జైలు సెట్‌లో మేజర్ సీన్స్ షూట్ చేశారు. బాలయ్య వయసు తగ్గ పాత్రలో కనిపించనున్నారు. యంగ్ ఏజ్‌లో జైలుకెళ్లి, వయసుపైబడ్డాక విడుదలై బయటకు వచ్చే క్యారెక్టర్ అని తెలుస్తుంది. అందుకు తగ్గట్టే బాలయ్య గెటప్, కాస్ట్యూమ్స్ అన్నీ సరికొత్తగా ఉన్నాయి. ఆయన మార్క్ సీరియస్ యాక్షన్‌తో పాటు తన స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు అనిల్.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహూ గారపాటి – హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.