బాలయ్య 61వ పుట్టిన రోజు సందర్భంగా ఎన్‌బీకే 107వ సినిమాని ప్రకటించారు నిర్మాతలు. లయన్‌ మోషన్‌ పోస్టర్‌తో గ్రాండియర్‌ వేలో ఈ కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు.

బాలయ్య బర్త్ డే సందర్భంగా తన అభిమానులకు మరో గిఫ్ట్ ఇచ్చేశాడు. గోపీచంద్‌ మలినేనితో చేయబోతున్న సినిమాని అధికారికంగా ప్రకటించారు. రవితేజతో రూపొందించిన `క్రాక్‌` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు గోపీచంద్‌ మలినేని. ఆ సినిమా నచ్చి అలాంటి ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ రోల్‌తో కూడిన సినిమా చేద్దామని బాలయ్య.. గోపీచంద్‌ మలినేనిని ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో బాలయ్య మార్క్ కథతో కథని సిద్ధం చేసి ఆయనకి వినిపించగా, వెంటనే ఓకే చేశారు. 

Scroll to load tweet…

ఇప్పుడు బాలయ్య 61వ పుట్టిన రోజు సందర్భంగా ఎన్‌బీకే 107వ సినిమాని ప్రకటించారు నిర్మాతలు. లయన్‌ మోషన్‌ పోస్టర్‌తో గ్రాండియర్‌ వేలో ఈ కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. తమన్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. త్వరలోనే హంట్‌ ప్రారంభం కాబోతుందని తెలిపారు. ఇదొక మెమరబుల్‌ ఫిల్మ్ అవుతుందని తెలిపారు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` చిత్రంలో నటిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తన బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ని బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.