ఇటీవల `అఖండ`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న బాలకృష్ణ తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించారు. టిప్స్ మాస్టర్‌గా మారిపోయారు. కోపానికి సంబంధించిన టిప్స్ ఇస్తున్నారు. 

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇటీవల `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే`(Unstoppablewithnbk) షోతో తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించారు. బాలకృష్ణ అంటే కోపం అనే టాక్‌ బయట రన్‌ అవుతుంది. ఆయన కోపానికి గురై అభిమానులను, ఆడియెన్స్ ని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయా వీడియోలు సోషల్‌ మీడియా వైరల్‌ అయ్యాయి. న్యూస్‌లుగా కూడా వచ్చాయి. దీంతో బాలయ్య అంటే ఫైర్‌ అనే టాక్‌ అందరిలోనూ ఉంది. 

కానీ Balayya చాలా మారిపోయారు. బాలయ్య అంటే కోపమే కాదు అంతకు మించిన మంచి క్వాలిటీలు ఆయనలో చాలా ఉన్నాయని చాటుకున్నారు `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే` షోతో. ఈ టాక్‌ షోతో ఆయనలో మంచి చిలిపితనం, సరదాతనం, కల్మషం లేని ముక్కుసూటి తనం బయటపడ్డాయి. ఆడియెన్స్, ఫ్యాన్స్ కూడా ఆయన్నిసరికొత్తగా చూశారు. అందరిలోనూ బాలకృష్ణపై అభిప్రాయమే మార్చేసిన షో ఇది. దీంతో ఆయనకు ఇంకా అభిమానులు పెరిగడం విశేషం. ఈ షో తాను నటించిన `అఖండ` చిత్రానికి కూడా హెల్ప్ కావడం విశేషం. 

ఇదిలా ఉంటే `ఆహా`లో బాలయ్య హోస్ట్ చేసిన `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే` షో రన్‌ అయిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా కోపానికిసంబంధించిన టిప్స్ ఇచ్చారు బాలయ్య. బాలకృష్ణ అంటేనే కోపం మరి ఆయనే యాంగర్‌ మేనేజ్‌మెంట్‌కి టిప్స్ ఇస్తే వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా `ఆహా`లో బాలయ్య కోపానికి సంబంధించి ఐడు టిప్స్ చెప్పారు. తనదైన స్టయిల్‌లో బోల్డ్ గా చెబుతూ అలరించారు. మరి బాలయ్య ఏం టిప్స్ ఇచ్చాడో ఓ లుక్కేద్దాం. 

బాలయ్య చెబుతున్న మొదటి టిప్‌- ఎవరైనా సరే మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలని, కోపంలో మీలో తేడా సింగ్ ను బయటకు తీసుకొస్తే అనవసరంగా సీన్‌ రాడ్‌ రంబోలా అవుతుందన్నారు. 
రెండో టిప్‌- ఏదైనా చేసే ముందు.. వన్‌ టూ త్రీ గో అని స్టార్ట్ చేస్తాం కదా, అలానే కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్క పెట్టుకోవాలని, కౌంట్‌ చేసే లోపు కోపం పోవాలని చెప్పారు. కోపం అదుపులోకి వస్తుందని తెలిపారు. 
మూడో టిప్‌- కోపం వచ్చినప్పుడు అసలు ప్రాబ్లెమ్ ఏమిటో తెలుసుకోవాలని, అరుపులు కేకలు పెట్టకుండా అసలు ప్రాబ్లం ఏంటో ఆలోచించాలని చెప్పారు.
నాల్గో టిప్‌- క్షమించేస్తే సమరసింహా రెడ్డి కంటే గొప్పవారు కావచ్చు. మనసులో ఏమి పెట్టుకోకుండా ఏది ఉంటే అది బయటపెట్టి క్షమించేయాలని తెలిపారు.
ఐదో టిప్‌- ఇది అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది. తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష అని అన్నారు. మీకోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ కోపం ఎక్కువ వస్తే మిగతా వాళ్ళ హెల్ప్ తీసుకుని శాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించి అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడని చెప్పారు. ఈ టిప్స్ ఫాలోయితే బాగుపడటాని చెప్పారు.

YouTube video player

బాలకృష్ణ ఇటీవల `అఖండ` చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నారు. `లెజెండ్‌` తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం `లెజెండ్‌`ని మించి సక్సెస్‌సాధించడం విశేషం. వంద కోట్లకుపైగా కలెక్షని రాబట్టింది. ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. డిసెంబర్‌ 2న ఈ చిత్రం విడుదలైంది. రేపు(శనివారం) సాయంత్రం కర్నూలులో `కృతజ్ఞత సభ` పేరుతో ఈ చిత్ర శతదినోత్సవ వేడుక సెలబ్రేషన్‌ చేయబోతున్నారు.