Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ రెడీ చేస్తున్న బాలయ్య, హ్యాట్రిక్ కాంబోలో మరో భారీ మూవీకి ప్లాన్

అభిమానులకోసం భారీ ట్రీట్ రెడీ చేస్తున్నాడు బాలయ్య. సర్ ప్రైజ్ ఇద్దామనుకుంటున్నట్టున్నాడు. అదిరిపోయే అనౌన్స్ మెంట్ తో త్వరలో సందడి చేయబోతున్నాడు. 

Balakrishna Boyapati Combination  Movie planning JMS
Author
First Published Mar 26, 2023, 8:02 AM IST

నటసింహం బాలయ్య మంచి ఊపుమీద ఉన్నాడు అఖండ విజయంతో.. దూసుకుపోతున్నాడు. రీసెంట్ గామళ్ళీ ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ.. అఖండ తరువాత వీరిసింహారెడ్డితో రచ్చ రచ్చ చేశాడు.. ఇక హ్యాట్రిక్ హిట్ కోసం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతుంది. ఈక్రమంలో బాలయ్య ఫ్యాన్స్ కోసం భారీ ట్రీట్ రెడీ చేస్తున్నాడట.ఈన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఫిల్మ్ ఇండస్ట్రీలో కకొన్ని కాంబినేషన్లు అలా నిలిచిపోతాయి అంతే.  సెపరేట్‌గా ఎన్న ప్లాప్ లు వచ్చినా.. ఈ కాంబినేషన్ కలిస్తే మటుకు హిట్టు పక్కా.. దాంతో  ఫ్యాన్స్‌  లో కూడా ఈ కాంబో మూవీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ కాంబినేషన్ పై క్రేజ్ అలా ఉంటుంది. అంత కాదు ఆ కాంబోలో  సినిమా వస్తుందంటే వసూళ్ల సునామీ బాక్సాఫీస్ ను ముంచెత్తినట్టే.. ఇక టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది  బాలకృష్ణ, బోయపాటి శ్రీను. వీళ్లిద్దరి కాబోలో ఇప్పటి వరకూ  తెరకెక్కిన మూడు మూవీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. బాలయ్యకు కెరీర్‌ బెస్ట్‌ కలెక్షన్‌లు తెచ్చిపెట్టిన సినిమాలు కూడా ఇవే.ఇక ఈ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

సింహా, లెజెండ్‌, అఖండ వంటి హ్యట్రిక్‌ బ్లాక్‌బస్టర్ల్ హిట్ల తరువాత  వీళ్ల కాబినేషన్ లో మరో సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమాను బాలయ్య  తన పుట్టినరోజు సందర్భంగా  జూన్‌ 10న... ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ గా .. గ్రాండ్‌గా ప్రకటించనున్నట్లు సమాచారం.  ప్రస్తుతం బోయపాటి శ్రీను, రామ్‌ పోతినేనితో యాక్షన్‌ సినిమా చేస్తున్నాడు. అటు బాలయ్య కూడా అనిల్ రావిపూడితో మరో సినిమా బిజీలో ఉన్నాడు. ఈరెండు సినిమాలు కంప్లీట్ అయిన తరువాత వీరి సినిమాపై ప్రకటన వస్తుందంటున్నారు. 

 మే వరకు బోయపాటితో.. రామ్ సినిమా షూటింగ్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. అటు వైపు  బాలయ్య అనీల్‌ రావిపూడితో సినిమా కూడా జూన్ వరకూ షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పికే ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు.  రీసెంట్ గా  ఉగాది సందర్భంగా రిలీజైన బాలయ్య పోస్టర్‌లకు మంచి స్పందన కూడా వచ్చింది. దాంతో ఈమూవీ షూటింగ్ చివరిదశలో ఉండగానే..బోయపాటి సినిమా స్టార్ట్ చేస్తాడట బాలయ్య. 

మరి బాలయ్య-బోయపాటి  సినిమాకు నిర్మాత ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. మైత్రీ మూవీస్ తో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి వారికి  ఈ బాధ్యతలు అప్పగిస్తారా..? లేదా... బోయపాటికి అత్యంత సన్నిహితుడైన మిర్యాల రవిందర్‌ రెడ్డి నిర్మాతగా వ్యవరిస్తాడా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే..  బాలయ్య పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, సితార సంస్థల్లో  కూడా సినిమా చేస్తానంటూ  సైన్‌ చేశాడు. మరి బోయపాటి కాంబోను ఏ నిర్మాత తెరకెక్కిస్తాడో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios