నటసింహం బాలయ్య బర్త్ డే వేడుకలు షురూ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ,  సందడి చేస్తున్నారు. జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే కాగా ఆయన లేటెస్ట్ మూవీ అఖండ నుండి బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు. కోరమీసం, కళ్లజోడులో చిరునవ్వుతో నడుచుకుంటూ వస్తున్న లుక్ ఆసక్తి రేపుతోంది. అఖండ న్యూ పోస్టర్ బాలయ్య అభిమానులకు పర్ఫెక్ట్ ట్రీట్ లా ఉంది. 


ఇప్పటికే అఖండ మూవీ నుండి రెండు లుక్స్ విడుదల చేశారు. పంచ కట్టులో ఓ లుక్, అఘోర లుక్ రివీల్ చేస్తూ రెండు టీజర్స్ విడుదల చేశారు. రెండు టీజర్స్ కి అద్భుత రెస్పాన్స్ దక్కింది. బర్త్ డే కానుకగా నేడు విడుదలైన మరో లుక్ అంచనాలు పెంచేదిగా ఉంది. బాలయ్య, బోయపాటిలది హిట్ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. 


అఖండ మూవీతో బాలకృష్ణ ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీంద్రా రెడ్డి అఖండ నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు, శ్రీకాంత్ కీలక రోల్స్ చేస్తున్నారు. అఖండ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.