Asianet News TeluguAsianet News Telugu

విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తున్న బాలయ్య!

అఖండ మూవీ నుండి రెండు లుక్స్ కి సంబంధించిన టీజర్స్ విడుదల కాగా,  రెండూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ అఖండ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

balakrishna akhanda teaser gets record views trending in top ksr
Author
Hyderabad, First Published Apr 17, 2021, 2:03 PM IST

బాలకృష్ణ జూలు విదిల్చితే ఎలా ఉంటుందో అఖండ టీజర్ శాంపిల్ చూపించింది. అఘోరా లుక్ లో బాలయ్య అదరగొట్టగా టీజర్ రికార్డు వ్యూస్ రాబడుతుంది. యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న అఖండ టీజర్ అతి తక్కువ సమయంలో 20మిలియన్ వ్యూస్ రాబట్టి, సినిమాపై అంచనాలు పెంచేసింది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని అనిపిస్తుంది. 


బాలయ్య క్లీన్ హిట్ అందుకొని చాలా కాలం అయ్యింది. ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసిన బాలయ్య మార్కెట్ బాగా దెబ్బతింది. వరుస ప్లాప్స్ ఆయన సినిమాల పట్ల ప్రేక్షకులకు ఆసక్తి తగ్గేలా చేశాయి. 2019లో విడుదలైన బాలయ్య చిత్రాలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఎన్నో అంచనాల మధ్య ఎన్టీఆర్ బయోపిక్స్ చేయగా, కనీస వసూళ్లు రాబట్టలేక పోయింది. చివరకు ఫ్రీగా సినిమా చూడండని బోర్డు పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 


అదే ఏడాది చివర్లో వచ్చిన రూలర్ సైతం ప్లాప్ గా నిలిచింది. పట్టుమని పదికోట్ల వసూళ్లు కూడా బాలయ్య స్థాయి హీరోకి రాకపోవడం విచారించదగ్గ విషయం. అందుకే కలిసొచ్చిన దర్శకుడితో బాలయ్య జతకట్టాడు. అఖండ మూవీతో బాలయ్య మరలా బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తున్నారు. 


అఖండ మూవీ నుండి రెండు లుక్స్ కి సంబంధించిన టీజర్స్ విడుదల కాగా,  రెండూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ అఖండ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమ్మర్ కానుకగా మేలో అఖండ విడుదల కానుంది. మిర్యాల రవీంధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios