`కేజీఎఫ్‌` మొదటి భాగంలో తమన్నా స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఆమె తనదైన మిల్కీ అందాలతో కనువిందు చేసింది. ఇప్పుడు తమన్నాని మించిన డోస్‌ ఇవ్వాలని చిత్ర బృందం ప్లాన్‌ చేసిందట

ఇండియన్‌ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ `బాహుబలి`లో ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసి యావత్‌ ఆడియెన్స్ ని షేక్‌ చేసింది నోరా ఫతేహి. ఇప్పుడు మరో ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుంది. మరో పాన్‌ ఇండియా చిత్రం `కేజీఎఫ్‌ 2`లో కనువిందు చేయబోతుంది. నోరా ఫతేహి ఐటెస్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె నటించిన సినిమాల్లో స్పెషల్‌ సాంగ్‌లే ఎక్కువగా ఉండటం విశేషం. తెలుగులో `బాహుబలిః ది బిగినింగ్‌`లో `మనోహరి` పాటలో కుర్రాళ్లకి హీటెక్కించింది. సినిమాలో గ్లామర్‌ యాంగిల్‌ని ఆవిష్కరించింది. 

వీటితోపాటు `కిక్‌ 2`, `టెంపర్‌`, `లోఫర్‌` చిత్రాల్లోనూ ఐటెమ్‌ సాంగ్‌లు చేసి తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. ముఖ్యంగా మాస్‌ ఆడియెన్స్ కి డ్రీమ్‌ గర్ల్ అయ్యింది. ఇటీవల బాలీవుడ్‌లో మనీ లాండరింగ్‌ కేసులో ఇరుక్కున్న ఈ భామ ఓ వైపు వివాదాల్లోనూ, మరోవైపు కెరీర్‌ పరంగానూబిజీగా ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు సౌత్‌ నుంచి వస్తోన్న మరో భారీ చిత్రం `కేజీఎఫ్‌ 2`లో ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందట. 

`కేజీఎఫ్‌` మొదటి భాగంలో తమన్నా స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఆమె తనదైన మిల్కీ అందాలతో కనువిందు చేసింది. ఇప్పుడు తమన్నాని మించిన డోస్‌ ఇవ్వాలని చిత్ర బృందం ప్లాన్‌ చేసిందట. అందుకు నోరా ఫతేహి అయితే బెటర్‌ అని నిర్ణయించారట. కమర్షియల్‌ అంశాలకు పెద్ద పీట వేస్తూ నోరాతో స్పెషల్‌ సాంగ్‌ చేయించారని తెలుస్తుంది. `షోలో` సినిమా లోని `మెహబూబా` పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దాన్ని `కేజీఎఫ్‌ 2`లో రీమిక్స్ చేసి ఐటెం సాంగ్ గా తీసుకురాబోతున్నట్లుగా ఇప్పటికే కన్నడ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న `కేజీఎఫ్` కు సీక్వెల్ అంటే భారీతనం ఉండాలని ప్రశాంత్ నీల్ ప్రతి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 14న కేజీఎఫ్ 2 నుండి ఆ ఐటెం సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పాటలో యశ్ కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ స్టెప్పులు వేసింది అనే వార్తలు మొదటి నుండి వచ్చాయి. అన్నట్లుగానే బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి తో ఈ పాటను చేయించినట్లుగా తెలుస్తోంది. 

యష్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న `కేజీఎఫ్ 2` సినిమా ఏప్రిల్‌ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇందులో యష్‌కి జోడీగా శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్‌ నటులు సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌ సైతం ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది మొదటి భాగాన్ని మించి ఉండబోతుందని ఇటీవల విడుదలైన టీజర్‌ చెప్పకనే చెప్పింది. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.