బాలీవుడ్ ‘ఖిలాడి’అక్షయ్ కుమార్, యంగ్ అండ్ డైనమిక్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి నటించబోతున్న మల్టీ స్టారర్ మూవీ ‘బడే మియా చోటే మియా’. బిగేస్ట్ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియాను తాజాగా రిలీజ్ చేశారు.
తెలుగు ప్రేక్షకులు బాలీవుడ్ నటులను కూడా ఆదరిస్తారు. వారిలో అక్షయ్ కుమార్ ఒకరు. తన స్టంట్స్ తో, సాహసాలతో టైగర్ ష్రాఫ్ యూత్ మెచ్చిన హీరోగా పెరుతెచ్చుకున్నాడు. అయితే ఒకే స్క్రీన్ పై ఖిలాడీ, హీరోపంథి కనిపిస్తే థియేటర్లు నిండిపోవాల్సిందే. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించనున్నారు. ఇదివరకే ఆ మూవీ టైటిల్ ‘బడే మియా చోటే మియా’ను రివీల్ చేస్తూ ఆడియెన్స్ కు క్టారీటీ ఇచ్చారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు.
“డబుల్ యాక్షన్, డబుల్ ధమాకా!! హీరోపంథిని ఖిలాడీలాగా చూపించాలా? మీకు సిద్ధమా?" అంటూ అక్షయ్ కుమార్‌తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు టైగర్. అక్షయ్ కుమార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు.పూజా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో 'బడేమియాన్ చోటేమియాన్' అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించనున్నారు. అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్‌తో అనౌన్స్ మెంట్ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు.
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఇద్దరూ కలిసి ఫస్ట్ టైం తెరపై కనిపించనున్నారు. వీరి ఇద్దరి యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో వచ్చే ఏడాది ఆడియెన్స్ కు ఇక పండగే. 2023 డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా బాక్స్-ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధమవుతోంది ఈ చిత్ర యూనిట్. 'టైగర్ జిందా హై', 'సుల్తాన్' మరియు 'భారత్' వంటి బాక్సాఫీస్ హిట్‌లను అందించిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ఇప్పుడు 'బడేమియాన్ చోటేమియాన్' ఫ్రాంచైజీకి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత వాషు భగ్నాని స్పందిస్తూ అమిత్ జీ మరియు గోవిందాలను కలిపి 1998లో డేవిడ్ దర్శకత్వంలో ‘బడే మియా చోటే మియా’ మూవీని రిలీజ్ చేశాం. మళ్లీ దానికి సీక్వెల్ గా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బడే మియాగా ‘అక్షయ్’ చోటేమియా గా ‘టైగర్ ష్రాఫ్’ నటించడం ఆనందం ఉంది. ఈ కొత్త తరానికి వీరిద్దరూ బడేమియన్ మరియు చోటేమియన్‌లుగా మారినందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.
కాగా, టైగర్ ష్రాఫ్ తనకెంతో ఇష్టమైన బాలీవుడ్ గ్రీక్ వీరుడు ‘హృతిక్ రోషన్’ తో కలిసి డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ 2019లో తెరకెక్కించిన ‘వార్’ మూవీలో నటించాడు. ఆ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ నే దక్కించుంది. టైగర్ ష్రాష్ ఈసారి తన యాక్షన్ కు ఎంటర్ టైన్ మెంట్ ను తోడు చేస్తూ ‘ఖిలాడీ’తో హంగామా చేయనున్నారు. ఇప్పటి నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.
