‘వాల్తేరు వీరయ్య’గా చిరంజీవి.. ‘వీరసింహారెడ్డి’గా బాలయ్య సంక్రాంతి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. దీంతో బ్యాక్ టు బ్యాక్ మాస్ అప్డేట్స్ అందిస్తూ సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల నుంచి మూడో పాట రిలీజ్ కు సిద్ధం అవుతోంది. 

సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకులకు అసలైన పండగను తీసుకురాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరియు నందమూరి బాలక్రిష్ణ (Balakrishna). చాలా కాలం తర్వాత వీరిద్దరికి సినిమాలు క్లాష్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకొని ఊపుమీద ఉన్నారు. ఇండస్ట్రీలో సీనియర్ హీరోల హవాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా.. బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా సంక్రాంతి బరిలోకి దిగారు. 

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల విడుదల సందర్భంగా ఆయా సినిమాలు కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇందుకు కారణంగా.. సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ అని చెప్పొచ్చు. రెండూ మాస్ యాక్షన్ ఫిల్మ్స్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. ఇందులోనూ బాలయ్య గాడ్ ఆఫ్ మాసెస్ గా, వింటేజ్ లుక్ లో ఊరమాస్ గా చిరంజీవి సరికొత్తగా దుమ్ములేపబోతున్నారు. థియేటర్లలో కంటే అప్డేట్స్ ఇవ్వడంలోనే గట్టి పోటీ కనిపిస్తోంది.

ఇప్పటికే రెండు చిత్రాల నుంచి పోస్టర్లు, టీజర్, ట్రైలర్ విడుదలై గట్టి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ను వదులుతూ అంచనాలను పెంచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య నుంచి మొదట మాస్ బీట్ తో ‘బాస్ పార్టీ’ రాగా.. ‘శ్రీదేవి చిరంజీవి’ సాంగ్స్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఇటు బాలయ్య ‘వీరసింహారెడ్డి’ నుంచి ‘జై బాలయ్య’ వచ్చి దుమ్ములేపింది. సెకండ్ సింగిల్ గా ఇటు నుంచి రొమాంటిక్ సాంగ్ ‘శ్రీదేవి చిరంజీవి’ రాగా.. అటు నుంచి లవ్లీ సాంగ్ ‘సుగుణ సుందరి’ వచ్చి యూట్యూబ్ లో రచ్చ చేస్తున్నాయి.

ప్రస్తుతం థర్డ్ సింగిల్ కోసం అంతా వేచ్చి ఉన్నారు. ఈ క్రమంలో రెండు చిత్రాల నుంచి మూడో పాటపై తాజాగా అప్డేట్ అందించారు. ‘వీరసింహారెడ్డి’ నుంచి థర్డ్ బ్లాక్ బాస్టర్ సాంగ్ ను సిద్ధం చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఈసారి ‘చిరు - రవితేజ’ కలిసి వచ్చేలా థర్డ్ సింగిల్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి అప్డేట్స్ తో మరింతగా హైప్ క్రియేట్ కానుంది. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. చిరు, బాలయ్య సరసన హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. జనవరి 12న ‘వీరసింహారెడ్డి’, జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి. 

Scroll to load tweet…