పవన్ కొత్త సినిమా ఎనౌన్సమెంట్ కూడా రీమేకే?
‘తెలుగు సినిమా అభిమాన పోలీస్ ఈజ్ బ్యాక్ ఇన్ హై ఓల్టేజ్ రోల్’ అని పేర్కొంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది. ఈ సినిమా సైతం రీమేక్ అని చెప్తున్నారు. మలయాళ హిట్ ‘అయ్యప్పన్ కోషియుమ్’ను సితార సంస్థ రీమేక్ కోసం రైట్స్ తీసుకున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్రను పోలీస్ గా మార్చారంటున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వకీల్‌సాబ్’ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఆయన ఇప్పటికే క్రిష్, హరీశ్ శంకర్‌లతో సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో పవన్ నటించనున్నారు. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త ప్రాజెక్ట్ ప్రకటిస్తూ ఓ ప్రత్యేక వీడియోని అభిమానులతో పంచుకుంది. ‘తెలుగు సినిమా అభిమాన పోలీస్ ఈజ్ బ్యాక్ ఇన్ హై ఓల్టేజ్ రోల్’ అని పేర్కొంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది. ఈ సినిమా సైతం రీమేక్ అని చెప్తున్నారు. మలయాళ హిట్ ‘అయ్యప్పన్ కోషియుమ్’ను సితార సంస్థ రీమేక్ కోసం రైట్స్ తీసుకున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్రను పోలీస్ గా మార్చారంటున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.
మలయాళంలో బిజూ మీనన్ చేసిన పాత్రను పవన్ తో , పృథ్వీరాజ్ పోషించిన పాత్రను రానా చేయనున్నారు. చిత్రంలో హీరోలు ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ అనే సన్నివేశాలున్నాయి. ‘అప్పట్లో ఒకడుండేవాడు’లోనూ అటువంటి సన్నివేశాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. అందుకని, రవితేజ-రానా హీరోయిజమ్ తగ్గకుండా సాగర్ చంద్ర సినిమా తీయగలడని భావిస్తున్నారట. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మలయాళ కథపై స్ర్కిప్ట్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం.
నారా రోహిత్, శ్రీ విష్ణుతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో విజయం అందుకున్నారీ యువ దర్శకుడు. అంతకు ముందు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా ‘అయ్యారే’ కూడా తీశారు. అయితే... ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు నచ్చడంతో పవన్, రానా చిత్రాన్ని సాగర్ కె. చంద్ర చేతుల్లో పెట్టాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ భావిస్తోందట.