చిన్నారి పెళ్లి కూతురు (బాలికా వదు)  ఫెమ్ అవికా గోర్ గత కొంత కాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగానే ఉంటుంది. ఆ మధ్య క్యాస్టింగ్ కౌచ్ పై గట్టిగానే కౌంటర్లు వేసిన అమ్మడు అవకాశాలు తగ్గడానికి ఒక వ్యక్తి కారణమని చెప్పి వెళ్లిపోయింది. అప్పట్లో ఉయ్యాలా  జంపాల - సినిమా చూపిస్త మామ సినిమాలతో అవికా మంచి క్రేజ్ అందుకుంది. 

అలాగే ఎక్కడికి పోతావు చిన్నవాడలో డిఫరెంట్ రోల్ లో కనిపించి మెప్పించింది. అనంతరం తెలుగులో పలు ఆఫర్లు వచ్చినా బేబీ ఎందుకో ఒప్పుకోలేదట. అయితే ఇన్నాళ్ళకి రాజుగారి గది 3 లో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆమెకు హీరోయిన్ క్యారెక్టర్ అఫర్ చేశారా? లేక ఏదైనా స్పెషల్ సపోర్టింగ్ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. 

ఎందుకంటే దర్శకుడు ఓంకార్ మెయిన్ లీడ్ కోసం తమన్నా - కాజల్ వంటి ముద్దగుమ్మలను ట్రై చేస్తున్నాడు. అయితే తమన్నా - తాప్సి ప్రాజెక్ట్ పై అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదట. కాజల్ ఒప్పుకునే అవకాశం ఉన్నట్లు టాక్. ఇక అవికా గోర్ అయితే త్వరలో మరికొన్ని తెలుగు సినిమాలతో ఆడియెన్స్ ని మెప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.