వివాదాస్పద వేణు స్వామితో అషురెడ్డి ప్రత్యేక పూజలు... వీడియో వైరల్!
అషురెడ్డి కొత్త కారు కొన్నారు. ఆమె వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ వీడియో అషురెడ్డి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది.
సెలబ్రిటీల భవిష్యత్తు చెబుతూ ఫేమస్ అయ్యాడు వేణు స్వామి. సమంత-నాగ చైతన్యల విడాకులు ఈయన ముందుగానే అంచనా వేశాడు. ప్రభాస్ సినిమాలు ప్లాప్ అవుతాయని కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ని కూడా వేణు స్వామి జాతకం ప్రకారం చెప్పారు. వేణు స్వామి జాతకాల్లో కొన్ని కరెక్ట్ అయ్యాయి. అయితే అతని జ్యోతిష్యం వివాదాస్పదంగా ఉంటుంది. హీరోల ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా మాట్లాడతారు.
కానీ టాలీవుడ్ లో ఈయనకు చాలా పేరుంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ పూజలు చేయించుకుంటారు. రష్మిక మందాన అయితే ఈయన భక్తురాలు. తరచుగా కలిసి పూజలు చేయించుకుంటుంది. అలాగే నిధి అగర్వాల్, డింపుల్ హయాతీ కెరీర్లో ఎదగాలని వేణు స్వామితో పూజలు చేయించారు. నందమూరి బాలకృష్ణ కూడా నా కస్టమరే అంటారు ఆయన.
తాజాగా అషురెడ్డి వేణు స్వామిని సంప్రదించింది. ఆమె కొత్తగా కొన్నకారుకు ఆయన పూజలు చేశారు. రేంజ్ రోవర్ వైట్ కలర్ కారును అషురెడ్డి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ కారుకు వేణు స్వామి పూజలు చేస్తున్నారు. కాగా గత పుట్టిన రోజుకు అషురెడ్డి బెంజ్ కారు కొనుగోలు చేసింది. తన తండ్రి గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పింది. ఈసారి ఆమె రేంజ్ రోవర్ పై కన్నేశారు.
కేవలం సోషల్ మీడియాలో ఫోటో షూట్స్, మోడలింగ్ చేస్తూ అషురెడ్డి భారీగానే సంపాదిస్తుంది. ఆమెకు అడపాదడపా సినిమా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య అషురెడ్డి ఎక్కువగా విదేశాల్లోనే ఉంటుంది. ఇటీవల ఆమె డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం కొసమెరుపు. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. అతని కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న సెలెబ్స్ లో అషురెడ్డి ఒకరు. ఈమెతో కేపీ చౌదరి వందలసార్లు మాట్లాడినట్లు ఆధారాలు దొరికాయి. తనపై వచ్చిన ఆరోపణలను అషురెడ్డి ఖండించారు...