నేడు నటుడు రాజీవ్ కనకాల పుట్టినరోజు. రాజీవ్ కనకాల పుట్టిన రోజు పురస్కరించుకొని సుమ ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలియజేశారు. ఈ సంధర్భంగా కొంత భావోద్వేగానికి గురైన సుమ ''వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే డియర్ రాజా. నువ్వు నా బలం మరియు సంతోషం. నువ్వు భర్తగా దొరకడం నా అదృష్టం. నువ్వు నాపక్కన ఉన్న ప్రతి దినం సరికొత్తగా ఉంటుంది. నేను  నీలో మమేకమై పోయాను, ఐ లవ్ యూ '  అని పోస్ట్ చేశారు. 

సుమ ట్విట్టర్ సందేశం చూస్తుంటే ఆమెకు భర్త రాజీవ్ పై ఉన్న ప్రేమాభిమానాలు తెలుస్తున్నాయి. నటిగా కెరీర్ ప్రారంభించిన సుమ కెరీర్ బిగినింగ్ లోనే నటుడు రాజీవ్ కనకాల ప్రేమలో పడ్డారు. రాజీవ్ కనకాల-సుమ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మలయాళ అమ్మాయి అయిన సుమ తెలుగుతో పాటు పలు భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. 

స్టార్ యాంకర్ గా బుల్లితెరను సుమ దశాబ్దాలుగా ఏలుతున్నారు. సినిమా వేడుక అయినా, షో అయినా హోస్ట్ గా సుమ ఉన్నారంటే రక్తి కట్టాల్సిందే. సమయస్ఫూర్తి, తెలుగు భాషపై పట్టు, చురుకు తనం సుమను స్టార్ యాంకర్ ని చేశాయి. సుమ-రాజీవ్ విడిపోయినట్లు ఆమధ్య వార్తలు రాగా వీటిని వీరిద్దరు ఖండించారు.