Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో ప్రత్యక్షమైన జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్..!

నూతన సంవత్సరం సందర్భంగా రాకింగ్ రాకేష్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనతో పాటు జోర్దార్ సుజాత ఉన్నారు.

As new year comes rocking rakesh and jordar sujatha visits Vijayawada temple
Author
First Published Jan 2, 2023, 2:18 PM IST

రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ వేదికగా వీరి ప్రేమ చిగురించింది. ఇతర ప్రేమకథల మాదిరి వీరిది కూడా ఉత్తుత్తి ప్రేమ అనుకున్నారు. ఓ టెలివిజన్ షోలో రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతకు అందరి ముందు ప్రపోజ్ చేశాడు. జోర్దార్ షోతో ఫేమస్ అయిన సుజాత బిగ్ సీజన్ 4లో పాల్గొన్నారు. హోస్ట్ నాగార్జునను సుజాత బిట్టు అని పిలిచేది. ఆ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండగా సుజాత జర్నీ ఎక్కువ వారాలు సాగలేదు.

అయితే బిగ్ బాస్ షో అనంతరం ఆమెకు బుల్లితెర ఆఫర్స్ పెరిగాయి. అలా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడే రాకేష్-సుజాత మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్ళుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. త్వరలో అధికారికంగా వివాహం చేసుకోనున్నారు. ఇక సుజాతతో పెళ్ళికి రాకేష్ మదర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే... ఆమె సుజాత విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. రాకేష్ అసలు వివాహం చేసుకోను అన్నాడట. తమ్ముడికేమో పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారట. బంధువులు అందరూ రాకింగ్ రాకేష్ వివాహం ఎప్పుడని అడుగుతుంటే ఆమెకు చాలా ఇబ్బందిగా ఉండేదట.

సుజాత కారణంగా రాకేష్ వివాహానికి ఒప్పుకోవడం సంతోషకర విషయం అని తల్లి అన్నారు. అలాగే సుజాతపై ఆమె ప్రశంసలు కురిపించారు. సుజాత వచ్చాక ఇల్లు సందడిగా మారింది. గలగలా మాట్లాడే సుజాత మా ఇంట్లో మరో చిన్నారి అయ్యిందంటూ కాబోయే కోడలిపై ప్రేమ కురిపించింది. పెళ్లికాకుండానే రాకింగ్ రాకేష్ ఇంట్లో సభ్యురాలు అయ్యింది సుజాత.

ఇక రాకింగ్ రాకేష్ చిన్న పిల్లల స్కిట్స్ కి ఫేమస్. మామూలు కమెడియన్ గా వచ్చి రాకేష్ టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న సీనియర్ కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్ ఒకరు. ఆడపడపాదడపా సినిమాల్లో కూడా రాకింగ్ రాకేష్ నటిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios