Asianet News TeluguAsianet News Telugu

నటిని కొట్టి బాత్రూంలోకి ఈడ్చుకెళ్లిన భర్త!

టీవీ నటి ఆర్జూ గోవిత్రీకర్ తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ నటించిన 'తమ్ముడు' సినిమాలో హీరోయిన్ గా నటించిన అదితి గోవిత్రీకర్ సోదరే ఆర్జూ గోవీత్రీకర్. 

arzoo govitrikar files complaint against husband
Author
Hyderabad, First Published Mar 6, 2019, 3:00 PM IST

టీవీ నటి ఆర్జూ గోవిత్రీకర్ తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ నటించిన 'తమ్ముడు' సినిమాలో హీరోయిన్ గా నటించిన అదితి గోవిత్రీకర్ సోదరే ఆర్జూ గోవీత్రీకర్. ఈమె నాగిన్ లాంటి పలు సీరియళ్ళలో నటించి బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2010లో ఈమె తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ సబర్వాల్ ని వివాహం చేసుకొంది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే తన భర్త ఎనిమిదేళ్లుగా మద్యం సేవించి తనను చిత్రహింసలు పెడుతున్నాడని ఆర్జూ పోలీసులకు ఫ్రియాడు చేసింది. ఐదేళ్ల నుండి భర్తకి దూరంగా వర్లీలోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నట్లు తెలిపింది.

కానీ సిద్ధార్థ్ తరచుగా వస్తూ తన కుమారుడిని తీసుకెళ్లిపోతున్నాడని, ఈ క్రమంలో శారీరక దాడికి పాల్పడుతున్నట్లు ఆర్జూ పేర్కొంది. తన భర్త తనపై దాడి చేసిన వీడియోను కూడా ఆర్జూ పోలీసులకు ఇచ్చింది. ఆ వీడియోలో ఆర్జూని ఆమె భర్త చెంపదెబ్బ కొట్టి బాత్రూంలోకి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

తాను కావాలని అలా చేయలేదని ఆర్జూ సీరియల్ రిహార్సల్స్ చేయమంటే చేశానని వాదన వినిపిస్తున్నాడు ఆమె భర్త. ఆర్జూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్ధార్థ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios