సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కథను బుచ్చిబాబు రెహమాన్ కి నెరేట్ చేయగా సినిమాకి మ్యూజిక్ అందించేందుకు రెహమాన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.


రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా త్వరలో తెరకెక్కనున్న సినిమాకి తాను సంగీతం అందించనున్నట్టు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ (AR Rehman) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. రామ్‌చరణ్‌ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు ఓ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందిస్తారంటూ ఇటీవల రూమార్స్‌ వచ్చాయి. ‘నాయకుడు’ సినిమా ప్రెస్‌మీట్‌లో రెహమాన్‌ వాటిపై స్పందించారు. ఆ ఊహాగానాలు నిజమేనని క్లారిటీ ఇచ్చారు. . “నేను రామ్‍చరణ్ సినిమాకు పని చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ పట్ల ఉత్సాహంగా ఉన్నా. ఇది చాలా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్” అని రహమాన్ చెప్పాడు. అధికారిక ప్రకటన వెలువడటమే ఇక ఆలస్యం. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి రెహమాన్ కు ఎంత ఇవ్వబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు రెహమాన్ కు ఈ సినిమా నిమిత్తం 2 కోట్లుకు ఇవ్వబోతున్నారని అంటున్నారు. అయితే రెహమాన్ ఈ సినిమాకు తక్కువే ఛార్జ్ చేస్తున్నారని అంటున్నారు. తెలుగు రీజనల్ మార్కెట్ సినిమా కాబట్టి 2 కోట్లే తీసుకుంటున్నారు కానీ మామూలుగా అయితే ఐదు నుంచి 7 కోట్లు దాకా డిమాండ్ చేసి తీసుకుంటారని చెప్తున్నారు. అయితే తెలుగులో చాలా కాలం తర్వాత చేస్తున్న సినిమా కావటం, కథ అద్బుతంగా ఉండటంతో #ARRahman రెహమాన్ తక్కువకే ఒప్పుకున్నాడని చెప్తున్నారు. ఇక రామ్ చరణ్ ఈ ప్రాజెక్టుకు రెహమాన్ ని తీసుకోవటానికి కారణం ఈ సినిమాని ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు స్దాయిలో నిలబెట్టాలనే ఆలోచనే అంటున్నారు. 

రెహమాన్‌ తెలుగు చిత్ర పరిశ్రమ వారితో పనిచేయడం కొత్తేమీ కాదు. కెరీర్‌ ప్రారంభంలోనే.. వెంకటేశ్‌ ‘సూపర్‌ పోలీస్‌’, రాజశేఖర్‌ ‘గ్యాంగ్‌ మాస్టర్‌’ తదితర చిత్రాలకు సంగీతం అందించారు. కొన్నాళ్ల విరామం అనంతరం, మహేశ్‌ బాబు ‘నాని’, పవన్‌ కల్యాణ్‌ ‘కొమరం పులి’, నాగ చైతన్య నటించిన ద్విభాషా చిత్రాలు ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’కు మ్యూజిక్‌ అందించి, అలరించారు.

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో ఆర్‌సీ 16 సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మించనున్నారు. సుకుమార్ రైటింగ్స్ కింద డైరెక్టర్ సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరించనుండగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పించనుంది.