దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మరోసారి ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. 

వరుసగా భారీ చిత్రాలు విడుదలవుతున్న తరుణంలో ఏపీలో టికెట్ ధరలపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వం పెంచిన టికెట్ ధరలతో రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ కి రెండు రోజుల ముందు కొత్త జీవో విడుదల చేసింది. అయితే ఆ టికెట్ ధరలపై ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది. 

టికెట్ ధరలు మరింతగా పెంచుకోవాలంటే ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకోవాలని.. ప్రొడక్షన్ కాస్ట్ 100 కోట్లకు పైగా ఉండాలని నిబంధనలు పెట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. సోమవారం రోజు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య ఏపీ సీఎం జగన్ ని కలిశారు. ఇంతలోనే ఏపీ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ చిత్రానికి గుడ్ న్యూస్ వినిపించింది. 

ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు అదనంగా రూ 100 పెంచుకునేలా ఆర్ఆర్ఆర్ చిత్రానికి అనుమతి ఇచ్చింది ఏపీ సర్కార్. దీనితో ఆర్ఆర్ఆర్ చిత్రానికి బిగ్ రిలీఫ్ లభించిందనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ చిత్రంపై నెలకొన్న అంచనాలకి తోడు పెంచిన టికెట్ ధరలు ఓపెనింగ్స్ విషయంలో కలసి రానున్నాయి. ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ ధరల విషయంలో ఈ స్థాయిలో బెనిఫిట్ పొందిన తొలి చిత్రం ఆర్ఆర్ఆర్ అనే చెప్పాలి. 

ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్, సముద్ర ఖని కీలక పాత్రలో నటిస్తున్నారు.