Asianet News TeluguAsianet News Telugu

స్పానిష్ ఫిల్మ్ రీమేక్ లో అనుష్క..?

చాలా కాలం పాటు సినిమాల నుండి బ్రేక్ తీసుకొని తన శరీర బరువును తగ్గించుకొని మళ్లీ స్లిమ్ గా తయారైంది అనుష్క.

Anushka to remake a Spanish film?
Author
Hyderabad, First Published Jun 4, 2019, 4:13 PM IST

చాలా కాలం పాటు సినిమాల నుండి బ్రేక్ తీసుకొని తన శరీర బరువును తగ్గించుకొని మళ్లీ స్లిమ్ గా తయారైంది అనుష్క. ప్రస్తుతం ఈ బ్యూటీ థ్రిల్లర్ నేపధ్యంలో సాగే 'సైలెన్స్' సినిమాలో నటిస్తోంది.

సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. అనుష్కతో పాటు మాధవన్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇప్పటికే అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని చాలా మంది దర్శకనిర్మాతలు ఆమె చుట్టూ తిరుగుతున్నారు.

కానీ అనుష్క మాత్రం ఓ స్పానిష్ సినిమా రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపుతుందని సమాచారం. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం విడుదలైన 'జూలియాస్ ఐస్' అనే థ్రిల్లర్ సినిమాను 
రీమేక్ చేయాలనుకుంటుంది అనుష్క. కబీర్ లాల్ ఈ సినిమాను డైరెక్టర్ చేయబోతున్నారని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో అనుష్క డ్యుయల్ రోల్ పోషించనుంది. రివెంజ్ డ్రామా నేపధ్యంలో సినిమా సాగనుంది. త్వరలోనే సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios