Asianet News TeluguAsianet News Telugu

అనుష్క గురించి కిక్కెక్కించే న్యూస్.. జేజమ్మ అలా నటిస్తే బాక్సాఫీస్ షేకైపోదూ..

సౌత్ లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకుంది అనుష్క శెట్టి. ప్రభాస్ కు సిల్వర్ స్క్రీన్  జోడిగా గుర్తింపు పొందింది. వీరిద్దరి గురించి ఎన్నో రూమర్స్ వినిపించాయి.

Anushka Shetty in talks for Chandramukhi 2
Author
Hyderabad, First Published Sep 18, 2021, 9:51 AM IST

సౌత్ లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకుంది అనుష్క శెట్టి. ప్రభాస్ కు సిల్వర్ స్క్రీన్  జోడిగా గుర్తింపు పొందింది. వీరిద్దరి గురించి ఎన్నో రూమర్స్ వినిపించాయి. కానీ ఎప్పటికప్పుడు అనుష్క, ప్రభాస్ ఆ రూమర్స్ ని ఖండిస్తూ వచ్చారు. 

ఇదిలా ఉండగా అనుష్క బాహుబలి తర్వాత అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రం రెండు మాత్రమే. అవి భాగమతి ఒకటి కాగా.. మరొకటి ఇటీవల విడుదలైన నిశ్శబ్దం. నిశ్శబ్దం తర్వాత అనుష్క మరే చిత్రానికి కమిట్ కాలేదు. 

బరువు కూడా పెరుగుతుండడంతో అనుష్క గురించి చాలా రూమర్స్ ఎక్కువయ్యాయి. అనుష్క ఇక సినిమాలకు దూరం అవుతోందని.. ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంలో అనుష్క ఎలాంటి స్పందన తెలియజేయలేదు. 

ఇక అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పినట్లేనా అనే అనుమానాలు పెరుగుతున్న సమయంలో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే అనుష్క కంబ్యాక్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఓ బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ తో. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 

రజనీ మానియాకు.. జ్యోతిక అద్భుత నటన తోడు కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. పి.వాసు ఆ చిత్రానికి దర్శకుడు. చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించేందుకు వాసు సిద్ధమయ్యారు. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్ హీరోగా నటించబోతున్నాడు. ఇక టైటిల్ రోల్ కోసం వాసు అనుష్కని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. 

చంద్రముఖిగా అనుష్క కనిపిస్తే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం. ఒకరకంగా చెప్పాలంటే అనుష్కకు ఇది అచ్చొచ్చిన జోనర్. అరుంధతి, భాగమతి లాంటి హర్రర్ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రాల్లో అనుష్క చెలరేగి నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే చంద్రముఖి 2 గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios