బాహుబలి  హీరోయిన్ అనుష్కశెట్టి నటించిన తాజా చిత్రం నిశ్శబ్దంఅక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్‌లో భాగంగా అనుష్క తెలుగు మీడియా తో ముచ్చటించారు. అయితే ఆమె హాఫ్ హార్టెడ్ గా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నట్లు మీడియాలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రెస్ మీట్ ని జూమ్ తో ఏర్పాటు చేసారు.

 అందరూ అనుష్క కనపడి తమతో మాట్లాడుతుందని భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కేవలం వాయిస్ ఆప్షన్ నే ఎంచుకున్నారు.దాంతో జూమ్ కాల్ లో హాజరైన మీడియా వారందరికీ ఆమె వాయిస్ మాత్రమే వినపడింది. ఆమె ముఖం కనపడలేదు. ఈ విధంగా జరుగుతుందని వారు ఊహించకలేదు.

అలా అనుష్క ఎందుకు చేసిందనే విషయం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అందుతున్న సమాచారం మేరకు .. కేవలం కోన వెంకట్ పట్టుపైనే అనుష్క ఈ ప్రెస్ మీట్ కు హాజరైందిట. తాను సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా గురించి మాట్లాడతాను అని, అప్పటిదాకా టైటిల్ కు తగ్గట్లు నిశ్శబ్దంగానే ఉంటానందిట. అయితే దర్శక,నిర్మాతలు..సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ అవసరమని పట్టుబట్టి ఆమెను మీడియా ముందుకు తెచ్చారట. దాంతో ఆమె అలా కేవలం తన వాయిస్ తో మేనేజ్ చేసిందని చెప్తున్నారు. 
 
నిజానికి ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ చేయడానికి చాలా నెలలు వెయిట్ చేసారు. కానీ లాక్‌డౌన్, తదనంతర కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ద్వారా రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకొన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలింస్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, మైఖేల్ మాడ్సన్, షాలిని పాండే, సుబ్బరాజు నటించారు.