Asianet News TeluguAsianet News Telugu

లారెన్స్ రిక్వెస్ట్ ని అనుష్క ఓకే చేస్తుందా?

తన క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు ఆమె అర్దం చేసుకుంటోంది. అయితే అది అద్బుతమైన కథ అయ్యి ఉండాలని కండీషన్ పెడుతోందని సమాచారం. అందులో తన పాత్ర కాస్తంత తక్కువ,ఎక్కువైనా ఓకే అంటోంది. ఈ క్రమంలోనే లారెన్స్ సైతం ఆమె చుట్టూ తిరుగుతున్నారట. అందుకు కారణం లేకపోలేదు.

Anushka agree to Lawrences request?
Author
Hyderabad, First Published Sep 22, 2021, 9:55 AM IST


సౌత్‌లో స్టార్‌ హీరోలకు సమానంగా క్రేజ్‌ సంపాదించుకున్న స్టార్ అనుష్క శెట్టి. ఉమెన్ ఓరియెంటెడ్‌ సినిమాలతో పాపులారిటీ దక్కించుకున్న అనుష్క నిశ్శబ్దం మూవీ తర్వాత మరే చిత్రానికి సైన్ చెయ్యలేదు. మంచి ప్రాజెక్టు అయితేనే ఓకే చెయ్యాలనుకుంటోంది. ఈ మేరకు దర్శక,నిర్మాతలు ఆమె చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. ఆమె ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నారు. కథలు చెప్తామంటూ అపాయింట్మెంట్స్ అడుగుతున్నారు. కానీ అనుష్క ఆచి,తూచి అడుగులు వేస్తోంది. తన క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు ఆమె అర్దం చేసుకుంటోంది. అయితే అది అద్బుతమైన కథ అయ్యి ఉండాలని కండీషన్ పెడుతోందని సమాచారం. అందులో తన పాత్ర కాస్తంత తక్కువ,ఎక్కువైనా ఓకే అంటోంది. ఈ క్రమంలోనే లారెన్స్ సైతం ఆమె చుట్టూ తిరుగుతున్నారట. అందుకు కారణం లేకపోలేదు.

 తమిళంలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న రాఘవ లారెన్స్ హీరోగా ప్రముఖ దర్శకుడు పి.వాసు తెరకెక్కించబోతున్నారు. ఆ మూవీలో హీరోయిన్ గా కన్ఫమ్ కాలేదని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘చంద్రముఖి’ కి సీక్వెల్ గా పి.వాసు కథ సిద్ధం చేశారట. లారెన్స్, పి.వాసు కలయికలో వచ్చిన ‘శివలింగ’ చిత్రం మంచి విజయం సాధించింది. దాంతో  ఈ సీక్వెల్ కూడా సెన్సేషనల్ హిట్ అవుతుందని అంటున్నారు. ఈ మేరకు జ్యోతిక చేసిన పాత్ర తరహాలో ఉన్న పాత్రను అనుష్క చేత చేయించాలని ప్లాన్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ కోసం అనుష్కని సంప్రదించారని, ఆమె కూడా ఈ చిత్రం చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇంకా ఇవ్వలేదని అంటున్నారు. ఈ మేరకు లారెన్స్ స్వయంగా రంగంలోకి దిగి అనుష్కని ఒప్పించాలని ఫిక్స్ అయ్యారట. ఈ విషయమై ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో జోరుగా  చర్చ నడుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుం

ఇక  పి.వాసు ‘చంద్రముఖి’ తర్వాత ‘చంద్రముఖి 2’ చెయ్యాలనుకున్నారు కానీ రజినీ అందులో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ‘చంద్రముఖి’ ని ముందుగా కన్నడలో, విష్ణు వర్ధన్ ప్రధాన పాత్రలో ‘ఆప్తమిత్ర’ పేరుతో తీశారు. దానికి సీక్వెల్‌గా ‘ఆప్తరక్షక’ చేశారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నాగవల్లి’ గా రీమేక్ చేశారు. ఈ నేపధ్యంలో స్టార్ హీరోయిన్ అనుష్క, పాపులర్ కొరియెగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్‌తో జతకట్టబోతోందనే వార్త మీడియా అండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నిశ్శబ్దం’ తర్వాత స్వీటీ కొత్త సినిమాలేవీ కమిట్ అవ్వలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios