Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హీరో చిత్రానికి రష్మిక నో.. ప్లాప్ హీరోయిన్ కి ఛాన్స్!

కన్నడ బ్యూటీ రష్మిక మందన కుర్రకారు హృదయాల్ని కొల్లగొడుతూ హీరోయిన్ గా దూసుకుపోతోంది. తెలుగు, తమిళ భాషల్లో అదిరిపోయే ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. రష్మిక తెలుగులో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. 

Anu Emmanuel was brought on board for Sivakarthikeyan's SK16
Author
Hyderabad, First Published May 15, 2019, 12:59 PM IST

కన్నడ బ్యూటీ రష్మిక మందన కుర్రకారు హృదయాల్ని కొల్లగొడుతూ హీరోయిన్ గా దూసుకుపోతోంది. తెలుగు, తమిళ భాషల్లో అదిరిపోయే ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. రష్మిక తెలుగులో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. త్వరలో ప్రారంభం కాబోయే నితిన్ చిత్రం భీష్మలో కూడా రష్మికనే హీరోయిన్. తమిళంలో కార్తీ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. గీత గోవిందం చిత్రంతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 

తమిళంలో స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన నటించే ఛాన్స్ రష్మికకు వచ్చింది. పాండిరాజ్ దర్శకత్వంలో శివకార్తికేయన్ 16వ చిత్రం తెరకెక్కనుంది. చాలా మంది హీరోయిన్లని పరిశీలించిన తర్వాత రష్మికని ఎంపిక చేశారు. కానీ రష్మిక ఈ చిత్రం నుంచి తప్పుకుందట. డేట్స్ తో పాటు, మరికొన్ని కారణాల వల్ల రష్మిక ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

దీనితో మరో హీరోయిన్ ని ఎంపిక చేశారు. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య రూపంలో అను ఇమ్మాన్యుయేల్ కు పరాజయాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ కు శివ కార్తికేయన్ సరసన నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరుని కూడా పరిశీలించారట. కానీ చివరకు అదృష్టం అను ఇమ్మాన్యుయేల్ నే వరించింది. ఈ చిత్రంతో అయినా అను ఇమ్మాన్యుయేల్ కు సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios