Asianet News TeluguAsianet News Telugu

నాని ‘అంటే సుందరానికీ’ నుంచి మరో సాలిడ్ సాంగ్.. రిలీజ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ చిత్ర విడుదలకు మరికొద్దిరోజులే సమయం మిగిలి ఉంది. దీంతో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.  తాజాగా మరో సాలిడ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. 
 

Another solid song from Nani Ante Sundaraniki Movie, Makers who have given release update
Author
Hyderabad, First Published May 21, 2022, 5:59 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో.. నేచురల్ స్టార్ నాని (Natural star Nani) చివరిగా శ్యామ్ సింగరాయ్ చిత్రంతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కూడా విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు నాని. ఈ క్రమంలో నాని నటించిన ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామా ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki). ఈ చిత్రంలో సుందర ప్రసాద్ గా బ్రహ్మణ వేషధారణలో అలరించనున్నాడు నాని. ఇక హీరోయిన్ నజ్రియా Fahad (Nazriya Fahad) నాని సరసన ఆడిపాడనుంది. ఈ చిత్ర షూటింగ్ పార్ట్ పూర్తైయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి మరికొద్ది రోజులే సమయం మిగిలి ఉంది.  దీంతో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. నాని యాక్టింగ్ యాస్ యూజువల్ గా నేచురల్ గా అనిపిస్తోంది. సుందర ప్రసాద్ గా నాని నవ్వులు పూయించడం ఖాయమని అర్థమవుతోంది. లీలా పాత్రలో నటిస్తున్న నజ్రియా, నాని లవ్ ట్రాక్ సినిమాలో హైలెట్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ అందించారు. 

ఈ చిత్రం నుంచి మరో సాలిడ్ సాంగ్ రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు. మే 23న ‘రంగో రంగో’ అనే టైటిల్ పేరిట థర్డ్ సాంగ్ ను విడుదల చేస్తామని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సాంగ్ లిరికల్ వీడియో రూపంలో రానుంది. ఇప్పటికే  ‘అంటే సుందరానికీ’ నుంచి రెండు సాంగ్స్ ను రిలీజ్ చేశారు. ‘పంచెకట్టు’, ‘ఎంత చిత్రం’ సాంగ్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి.  సెకండ్ సింగిల్ లకు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్ అందించారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios