Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ బయోపిక్ లో మరో దర్శకుడు

దర్శకుడు క్రిష్ తరచు సినిమాకు సంబందించిన ఎదో ఒక విషయాన్నీ తెలియజేస్తూ అంచనాలను పెంచుతున్నాడు. ఇప్పటికే ప్రధాన పాత్రలను చిత్ర యూనిట్ ఫైనల్ చేసింది. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్ లో వేగాన్ని కూడా పెంచింది

another director in ntr biopic
Author
Hyderabad, First Published Sep 26, 2018, 3:53 PM IST

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై రోజు రోజుకి అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి. దర్శకుడు క్రిష్ తరచు సినిమాకు సంబందించిన ఎదో ఒక విషయాన్నీ తెలియజేస్తూ అంచనాలను పెంచుతున్నాడు. ఇప్పటికే ప్రధాన పాత్రలను చిత్ర యూనిట్ ఫైనల్ చేసింది. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్ లో వేగాన్ని కూడా పెంచింది. 

అసలు విషయంలోకి వస్తే రీసెంట్ గా ఒక ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు క్రిష్ మరో దర్శకుడిని కలిశాడు. భద్రాచలం - జయం మనదేరా వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఎన్.శంకర్ ను ఎన్టీఆర్ బయోపిక్ లో కనిపించనున్నారట. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే విజువల్ వండర్స్ ని చూపించిన దర్శకుడు విఠాలచర్య పాత్రకు ఎన్.శంకర్ ని ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ తో విటలాచార్య బందిపోటు - పిడుగురాముడు - ఆలీబాబా 40 దొంగలు వంటి సూపర్ హిట్ చిత్రాలను చేశారు. 

ఎన్టీఆర్ సినిమా కెరీర్ ను మలుపుతిప్పిన వారిలో విటలాచార్య ప్రముఖ వ్యక్తి. అలాంటి గ్రేట్ డైరెక్టర్ పాత్రలో ఎన్.శంకర్ కనిపించబోతున్నారు. క్రిష్ కూడా సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల రాజకీయాలకు సంబందించిన సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు క్రిష్ త్వరలో ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి సంబందించిన షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నాడు. బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తుండగా చంద్రబాబు క్యారెక్టర్ లో రానా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక  కీరవాణి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios