Asianet News TeluguAsianet News Telugu

హీరోతో బ్రేకప్.. ఇప్పుడు మరొకరి ప్రేమలో నటి!

ప్రముఖ టీవీ నటి అంకిత లొఖండే గతంలో సుశాంత్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. 

Ankita Lokhande Confirms Dating vicky jain
Author
Hyderabad, First Published Jan 17, 2019, 3:15 PM IST

ప్రముఖ టీవీ నటి అంకిత లొఖండే గతంలో సుశాంత్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. చాలా ఏళ్ల పాటు ఈ జంట రిలేషన్ కొనసాగించిందని చెబుతారు. బయట కార్యక్రమాల్లో కూడా ఇద్దరూ చాలా సార్లు కలిసి కనిపించారు.

ఆ తరువాత ఏమైందో.. కొన్నాళ్ల క్రితం ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు అంకిత మరొకరితో ప్రేమలో ఉందని తెలుస్తోంది. మీడియాలో తన ప్రేమ పెళ్లిపై వస్తోన్న వార్తలపై స్పందించిన ఈ బ్యూటీ తాను బిలాస్ పూర్ ప్రాంతానికి చెందిన విక్కీ జైన్ అనే బిజినెస్ మెన్ ని ప్రేమిస్తున్నట్లు స్పష్టం చేసింది.

తాను ప్రేమలో ఉన్న మాట నిజమేనని, అతడు చాలా మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. సమయం వచ్చినప్పుడు తన పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తానని తెలిపింది. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని.. కాని ప్రేమ మీద చాలా నమ్మకం ఉందని అన్నారు.

ఇప్పటివరకు టీవీ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఈ బ్యూటీ 'మణికర్ణిక' సినిమా ద్వారా వెండితెరపై సందడి చేయబోతుంది. ఝాన్సీ లక్ష్మీబాయ్ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అంకితం ఝాల్కరిభాయ్ అనే పాత్రలో కనిపించనుంది. ఈమె పాత్రకు నిడివి కూడా చాలా ఎక్కువని తెలుస్తోంది. జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios