Asianet News TeluguAsianet News Telugu

75 మందితో డేటింగ్ చేశా.. భార్య ముందే చెప్పిన హీరో!

బాలీవుడ్ హీరో అంగద్ బేడీ రీసెంట్ గా నేహా ధుపియాను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నేహా గర్భవతి. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. అంగద్ నటుడిగా బిజీగా గడుపుతుంటే నేహా మాత్రం టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఇటీవల నేహా నిర్వహిస్తోన్న ఓ టాక్ షోకి అతిథిగా వచ్చాడు అంగద్ బేడీ. 

Angad Bedi was left stranded by his girlfriend in New York with no money
Author
Hyderabad, First Published Nov 17, 2018, 11:20 AM IST

బాలీవుడ్ హీరో అంగద్ బేడీ రీసెంట్ గా నేహా ధుపియాను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నేహా గర్భవతి. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. అంగద్ నటుడిగా బిజీగా గడుపుతుంటే నేహా మాత్రం టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఇటీవల నేహా నిర్వహిస్తోన్న ఓ టాక్ షోకి అతిథిగా వచ్చాడు అంగద్ బేడీ. ఈ సందర్భంగా ఆమె అడిగిన పలు ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పేశాడు.

తన భార్య ముందే అంగద్ బేడీ ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు చర్చించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు ఎంతమందితో డేటింగ్ చేశావనే ప్రశ్నకు సమాధానంగా అంగద్ 75 అని నెంబర్ చెప్పాడు. భార్య ముందే తాను వివాహానికి ముందు 75 మందితో డేటింగ్ చేసినట్లు ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అలానే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నిన్ను బార్ లో వదిలేసి వెళ్లిపోయిందంట కదా అని అడగగా.. అప్పటి సంఘటనను వివరంగా చెప్పుకొచ్చాడు. ''ఆమె నా కంటే మూడేళ్లు పెద్దది. తన 30వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో ఓ బార్ కి వెళ్లాం. తన స్నేహితులు కూడా ఉన్నారు. అయితే ఎక్కువ ఆల్కహాలు తీసుకోవడంతో ఆమె కంట్రోల్ పోయి అక్కడ నుండి వెళ్లిపోయింది. నా వాలెట్, మొబైల్ తన హ్యాండ్ బ్యాగ్ లోనే ఉండిపోయాయి.

నాకేం చేయాలో అర్ధం కాని స్థితిలో నా స్నేహితులు కొందరు అక్కడ కనిపించారు. వారి సహాయంతో బయటపడ్డాను. మేం ఏరియాలో రూమ్ తీసుకున్నామనే విషయం కూడా నాకు తెలియదు. ఫైనల్ గా నా ఫ్రెండ్స్ సహాయంతో ఆమెను చేరుకోగలిగాను. నాకు విపరీతమైన కోపం వచ్చి అక్కడ నుండి వెళ్లిపోవాలని లగేజ్ సర్దుకున్నాను. అప్పటికి ఆమెకు మత్తు దిగడంతో నన్ను ఆపే ప్రయత్నం చేసింది.

నేను మియామి వెళ్లడానికి ముందే టికెట్స్ బుక్ చేశాను. ఆ వెకేషన్ మిస్ అవ్వడం ఇష్టం లేక అక్కడే ఉన్నాను. మియామి వెళ్లిన తరువాత కూడా మా ఇద్దరికి గొడవ జరిగింది. తన గదిలో ఉండొద్దని చెప్పింది. నీ రూమ్ లో లేకపోతే నేను ఇంకా సంతోషంగా ఉంటానని బయటకి వచ్చేశా.. ఆ తరువాత కొంతమంది అమ్మాయిలతో కలిసి చాలా ఎంజాయ్ చేశాను. మియామికి నేను ఒంటరిగా వచ్చి ఉంటే బాగుండేది'' అంటూ చెప్పుకొచ్చాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios