Asianet News TeluguAsianet News Telugu

యాంకర్ విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం

నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించడానికి నువ్వు ఎన్ని ఇక్కట్లు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను

Anchor Vishnu Priya Mother Passed Away
Author
First Published Jan 27, 2023, 11:38 AM IST

 యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కన్నతల్లి కాలం చేశారు. గురువారం ఆమె తల్లి తుదిశ్వాస విడిచినట్లు స్వయంగా విష్ణు ప్రియానే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. తన తల్లితో కలిసున్న ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ విష్ణు ప్రియ ఎమోషనల్ అయ్యింది.

 

తన పోస్టులో.. “మై డియర్ అమ్మ.. ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వు నా బలం, నువ్వే నా బలహీనత. ప్రస్తుతం నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. నువ్వు ప్రతిచోట, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా..” అంటూ విష్ణుప్రియ భావోద్వేగ భరిత పోస్టును షేర్ చేసుకుంది. ఈ వార్త తెలుసుకున్న బుల్లితెర కమేడియన్లు, యాంకర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 య్యూబర్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ యాంకర్ గా మారి... ఇప్పుడు హీరోయిన్ గా ఎదిగిన టాలెంట్ విష్ణుప్రియ. యాంకర్ గా రాణిస్తూనే అటు హీరోయిన్ గా కూడా ప్రయత్నాలు సాగించింది. ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడు సినిమాలో హీరోయిన్ గా చేసి మెప్పించింది.  పోవే పోరా షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె  సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసిన హంగామానూ ఎవరూ మర్చిపోలేరు. పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే నటిగానూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios