Asianet News TeluguAsianet News Telugu

ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం.. ఇంట్రెస్టింగ్ గా టైటిల్, అనౌన్స్ మెంట్ పోస్టర్

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ఈరోజు గ్రాండ్ గా ప్రారంభమైంది. తొలిసారిగా తమిళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. విజయ్ దేవరకొండ ప్రారంభించిన మూవీ డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 
 

Anand Deverakondas new film Duet  Launched Officially NSK
Author
First Published Nov 2, 2023, 2:42 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)  తన రాబోయే చిత్రాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ కుర్ర హీరో ‘బేబీ’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ కూడా మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు. తమిళ దర్శకుడు క్రిష్ మిథున్ డైరెక్టర్ గా ఆనంద్ దేవరకొండ సినిమా రూపుదిద్దుకుంటోంది. చిత్రాన్ని ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 

సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమాను లాంచ్ చేశారు. టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.  ఇక మూవీ విషయానికొస్తే.. డిటేయిల్స్ ఇట్రెస్టింగ్ గా ఉన్నాయి.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా (Gnanavel Raja)  నిర్మిస్తుండటం విశేషం. మిథున్ దర్శకత్వం వహిస్తున్నారు. అతని ఇది డెబ్యూ మూవీ. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ హీరోయిన్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ (Ritika Nayak)  ఆనంద్ సరసన నటిస్తోంది. 

స్టూడియో గ్రీన్ 2 బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. సూర్య, కార్తీలతో నిర్మాత జ్ఞానవేల్ రాజా ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ఇక ఆనంద్ తో ఎలాంటి సినిమాను ప్రేక్షకులకు అందిస్తారో చూడాలి. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.  ఇక టైటిల్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓవైపు సూర్యుడు, మరోవైపు చందుడ్రి అర్ధభాగాలను చూపిస్తూ.. సూర్యుడివైపు కథనాయకుడిని, చంద్రుడివైపు కథనాయికను చూపించారు. వీరిద్దరి ప్రయాణం సూర్యచంద్రుల వలే సాగుతుందని పోస్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. 

ఏదేమైనా విజయ్ తన లైనప్ లోని చిత్రాలను నెమ్మదిగా పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ దర్శకుడు వినోద్ అనంతోజ్ కాంబోలో మరో సినిమా చేయబోతున్నారని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్టు టాక్. ఇక ప్రస్తుతం ‘గం గం గణేశా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. 

Anand Deverakondas new film Duet  Launched Officially NSK

Follow Us:
Download App:
  • android
  • ios