ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు పండగల విషెస్ ని చాలా స్పెషల్ గా చెబుతున్నారు. మొన్నామధ్య దీపావళి రోజు షాహిద్ కపూర్ తన భార్యని ముద్దుపెడుతున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. దీపావళి శుభాకాంక్షలు ఇలాగేనా చెప్పేది అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. హీరోయిన్ దిశాపటాని దీపావళితో పాటు ఇటీవల జరిగిన క్రిస్మస్ రోజు కూడా తను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న ఓ ఇన్నర్ కంపనీ లో దుస్తులు ధరించి పండగ విషెస్ చెప్పింది.

తాజాగా అమీజాక్సన్ కూడా ఇలాంటి లిస్ట్ లోకి చేరింది. తన బాయ్ ఫ్రెండ్ ని ముద్దు పెడుతూ దిగిన ఫోటోని పోస్ట్ చేసి క్రిస్మస్ విషెస్ చెప్పింది. మల్టీ మిలియనీర్ రియల్ ఎస్టేట్ కింగ్ అయిన జార్జి పనాయట్టుతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఎమీజాక్సన్ ఇలా ఘాటైన చుంబనంతో అభిమానులకు విషెస్ చెప్పింది. మరి ఈ ఏడాదైనా ఈ జంట పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి!