ఉత్తరాఖండ్‌ సీఎంకి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలి నందా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ముందు మీ ఆలోచనలు మార్చుకోండి అంటూ మండిపడింది. సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారంటూ కౌంటర్‌ ఇచ్చింది. మరి ఇంతకి ఆ కథేంటో చూస్తే, 

ఉత్తరాఖండ్‌ సీఎంకి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలి నందా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ముందు మీ ఆలోచనలు మార్చుకోండి అంటూ మండిపడింది. సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారంటూ కౌంటర్‌ ఇచ్చింది. మరి ఇంతకి ఆ కథేంటో చూస్తే, ఇటీవల అమ్మాయిలు ధరించే దుస్తులపై ఉత్తరాఖండ్‌ సీఎం తీరత్‌ సింగ్‌ రావత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిరిగిన జీన్స్ వేసుకుని ఎక్స్ పోజింగ్‌ చేయడం, వాటిని ధరించడం స్టేటస్‌ సింబల్‌గా భావించడం దురదృష్టకరమన్నారు. ఇది మన కల్చర్‌ని దెబ్బ తీయడమే అవుతుందన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా పోటీ పడి మరీ స్కిన్‌ షో చేయడానికి ఆయన విమర్శించాడు. 

అయితే దీనిపై సోషల్‌ మీడియా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నెటిజన్లు సీఎం పై దుమ్మెత్తిపోస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? అంటూ మండిపడుతున్నారు. తాజాగా అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందా సైతం స్పందించారు. సీఎం వ్యాఖ్యలకు తీవ్రంగా కౌంటర్‌ ఇచ్చారు. `మా వస్త్రధారణ మార్చే ముందు మీరు మీ ఆలోచనలు మార్చుకోండి. ఎందుకంటే మీరు సమాజానికి ఇస్తున్న సందేశాలు మమ్మల్ని మరింత షాక్‌కి గురి చేస్తున్నాయి` అని ఇన్‌ స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. జీన్స్ ధరించిన ఫోటో షేర్‌ చేస్తూ, నేను సగర్వంగా ఈ జీన్స్ ని ధరిస్తాను` అని దిమ్మతిరిగేలా చెప్పింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.