సాధారణంగా స్టార్ కు క్రేజ్ ఉన్నప్పుడు అప్పుడెప్పుడో ఆగిపోయిన సినిమాలకు మోక్షం వస్తుంది. క్రేజ్ లేని టైమ్ లో తీసిన సినిమాలు బిజినెస్ చేసుకుని మన ముందుకు వస్తూంటాయి. ఇప్పుడు అలాంటిదే సత్యదేవ్ విషయంలో జరగబోతోందని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సత్యదేవ్ హీరోగా వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఓటీటీ ద్వారా సత్యదేవ్ మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఆ సినిమాలు కూడా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వస్తాయంటున్నారు. అదే కోవలో ఇప్పుడు వచ్చే నెలలో గువ్వ గోరింక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.
 
అయితే గువ్వా గోవింక టైటల్ వినగానే ఎక్కడో..ఎప్పుడో విన్నట్లు అనిపిస్తోంది కదా. అవును..ఈ సినిమా సత్యదేవ్ కెరీర్ ప్రారంభం రోజుల్లో అంటే పూరితో జ్యోతిలక్ష్మి చేసినప్పటిది. అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రకటన వచ్చింది.

 భిన్న మ‌న‌స్త‌త్వం క‌లిగిన ఇద్ద‌రు ప్రేమికుల క‌థ ఇది. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. ఆకార్ మూవీస్ పతాకంపై రామ్‌గోపాల్‌వ‌ర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దాము కొసనం, ‘దళం ’జీవన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. చైతన్య, మధుమిత, పెళ్లిచూపులు ప్రియదర్శి, ఈటీవీ ప్రభాకర్, ఫిష్ వెంకట్, సత్య ప్రియ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, మాటలు: బజారా, డీఓపీ: మైల్స్ రంగస్వామి.