Bigg Boss Telugu 7: `నువ్వేం పీకావ్`.. భోలేపై నోరు జారిన అమర్ దీప్.. నామినేషన్ల రచ్చ
ప్రియాంక.. రతిక, భోలేలను నామినేట్ చేసింది. రతిక రీఎంట్రీలో బాంబ్‌లా వస్తావనుకున్నా, కానీ ఇలా డీలా పడిపోయావని, ఇకపై అయినా గేమ్ ఆడుతావని నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది.

బిగ్ బాస్ తెలుగు 7.. తొమ్మిదే వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ఎపిసోడ్‌లో ఈ వారానికి సంబంధించి హౌజ్‌లో ఉండేందుకు అర్హులు కాని వారిని నామినేట్ చేయాల్సి ఉందని బిగ్ బాస్ తెలిపారు. స్నేక్ ముందు ఉండి నామినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నామినేషన్‌ని ప్రశాంత్ ప్రారంభించాడు. అమర్, తేజలను నామినేట్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్ లో అమర్ చేసిన తప్పుకి నామినేట్ చేశాడు. అటు ఇటుగా అదే రీజన్‌తో తేజని నామినేట్ చేశాడు.
ప్రియాంక.. రతిక, భోలేలను నామినేట్ చేసింది. రతిక రీఎంట్రీలో బాంబ్‌లా వస్తావనుకున్నా, కానీ ఇలా డీలా పడిపోయావని, ఇకపై అయినా గేమ్ ఆడుతావని నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. భోలేని గత వారం నామినేషన్‌ని తీసుకొచ్చి నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదన జరిగింది. భోలే రియాక్షన్‌కి ప్రియాంక ఫ్రస్టేట్ అయ్యింది. ఆవేశానికి గురయ్యింది. అర్జున్.. శోభా శెట్టి, అమర్ దీప్‌లను నామినేట్ చేశౠడు. శివాజీ.. అమర్ దీప్, తేజలను నామినేట్ చేశాడు. రతిక.. ప్రియాంక, శోభాశెట్టిలను నామినేట్ చేసింది.
ఈ క్రమంలో ప్రియాంక, శోభా శెట్టిలతో రతిక మధ్య వాదన గట్టిగానే సాగింది. తన ఆట చూడాలని, ఇప్పుడే పంపిస్తున్నారని ఆమె వాపోయింది. కానీ రతిక వాదనలో పసలేదు. ఆమె రియాక్ట్ అయిన తీరు ఫేక్‌గా ఉంది. మరోవైపు తేజ.. అర్జున్‌ని, రతికలను నామినేట్ చేశాడు. ఇన్నాళ్లు నామినేట్‌లో లేవని అర్జున్‌ని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో నవ్వులు పూయించాడు. మరోవైపు రతిక ఆట చూడాలని నామినేట్ చేస్తున్నానని తెలిపాడు. దీనికి రతిక వేసిన పంచ్ హైలైట్ గా నిలిచింది.
ఇక భోలే.. ప్రియాంక, అమర్ దీప్‌లను నామినేట్ చేశాడు. దానికి ముందు పాటపాడుతూ, సామెతలు చెబుతూ పెద్ద హంగామా చేశాడు. అయితే అమర్ దీప్ విషయంలో పెద్ద గొడవే అయ్యింది. అమర్ దీప్ చేసిన తప్పులను, గత నామినేషన్‌ని తీసుకుని నామినేట్ చేశాడు. అయితే భోలే, అమర్ దీప్‌ల మధ్య గొడవ పెరిగింది. అమర్ దీప్ ఆవేశంలో ఊగిపోయాడు. భోలే దెబ్బకి ఆయన ట్రాప్‌లో పడి బూతులు వాడాడు. `నువ్వేం పీకావ్` అంటూ ఫైర్ అయ్యాడు. ఇది వివాదంగా మారింది. తన దృష్టిలో తప్పు కాదని, దానికి తానేం చేయలేనని ఆయన తెలిపారు. ప్రియాంక జోక్యం చేసుకుని సారీ చెప్పించింది. అయినా వెటకారంగా అమర్ రియాక్ట్ అయిన తీరు మరింత అగ్గి రాజేసేలా చేసింది. అయినా మారు అంటూ భోలే అతన్ని సముదాయించే ప్రయత్నంచేశాడు.
అయితే ఇంకానామినేషన్ల ప్రక్రియ కంప్లీట్ కాలేదు. ఈ వారంలోనూ ప్రియాంక, శోభా శెట్టి, తేజ, అమర్ దీప్, భోలే, రతిక, యావర్, అశ్విని, అర్జున్ నామినేషన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. రేపు దీనిపై క్లారిటీ రానుంది. ఇక ఎనిమిదో వారంలో సందీప్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.