అక్కినేని అమలను గుర్తు చేసుకుంటూ బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ కపూర్ ఒకప్పటి ఫోటో షేర్ చేశారు. 

బాలీవుడ్ లో తరాలుగా కపూర్ ఫ్యామిలీ ఆధిపత్యం ఉంది. పలువురు హీరోలు హీరోయిన్స్, నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో సంజయ్ కపూర్ ఒకరు. ఆయన 1995లో ప్రేమ్ అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తో హీరో అయ్యాడు. అయితే సంజయ్ కపూర్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. కాగా సంజయ్ కపూర్ మొదటి సినిమా హీరోయిన్ అమల కావాల్సిందట. 1987లో ఓ ప్రాజెక్ట్ కోసం సంజయ్ కపూర్, అమలను హీరో హీరోయిన్స్ అనుకున్నారట. 

సంజయ్ కపూర్-అమల మీద ఫోటో షూట్ కూడా జరిగిందట. అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత కొన్నేళ్ళకు సంజయ్ కపూర్ ప్రేమ్ మూవీతో హీరో అయ్యాడు. అమల మాత్రం అప్పటికే హీరోయిన్. సౌత్ లో చిత్రాలు చేస్తున్నారు. తమిళంలో ఆమె బిజీ యాక్ట్రెస్ గా ఉన్నారు. 

View post on Instagram

ఇక అమలతో చేయాల్సిన సినిమా ఆగిపోయిన విషయాన్ని సంజయ్ కపూర్ తాజాగా బయటపెట్టారు. గతంలో ఆమెతో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన సంజయ్ కపూర్, 1987లో బ్యూటిఫుల్ అమలతో నా ఫస్ట్ ఫోటో షూట్. నా డెబ్యూ మూవీ హీరోయిన్ అమల కావాల్సింది. కాకపోతే ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదని కామెంట్ పెట్టాడు. సంజయ్ కపూర్ పోస్ట్ పై ఆయన భార్య మహీప్ స్పందించడం విశేషం. 1987లోనా... అప్పటికి నా వయసు కేవలం 14 ఏళ్ళు అని ఆమె కామెంట్ చేశారు. 

కాగా అమల తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అక్కినేని నాగార్జునను ప్రేమ వివాహం చేసుకుంది. 1992లో నాగార్జున-అమల వివాహం జరిగింది. పెళ్లయ్యాక ఆమె సినిమాలు చేయలేదు . క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.