Asianet News TeluguAsianet News Telugu

అభిమాని అడిగాడని ఈ హీరో ఏం చేస్తున్నాడో తెలుసా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడు శిరీష్ కోసం మ్యాక్ ల్యాప్ టాప్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు హీరో అల్లు శిరీష్. ''20 ఏళ్లుగా విండోస్ యూజర్ గా ఉన్నాను.. ఇప్పుడు మ్యాక్ కి మారాను'' అంటూ తన ల్యాప్ ట్యాప్ ఫోటోని పోస్ట్ చేశాడు అల్లు శిరీష్.

allu sirish tweet goes viral
Author
Hyderabad, First Published Sep 27, 2018, 2:36 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడు శిరీష్ కోసం మ్యాక్ ల్యాప్ టాప్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు హీరో అల్లు శిరీష్. ''20 ఏళ్లుగా విండోస్ యూజర్ గా ఉన్నాను.. ఇప్పుడు మ్యాక్ కి మారాను'' అంటూ తన ల్యాప్ ట్యాప్ ఫోటోని పోస్ట్ చేశాడు అల్లు శిరీష్.

ఈ ట్వీట్ చూసిన ఓ నెటిజన్.. ''అన్నా నాకు కూడా చిన్న ల్యాప్ టాప్ గిఫ్ట్ గా ఇవ్వు.. నేను కొనాలి అంటే ఇంకో మూడేళ్లు పడుతుంది. నాకు ఫ్యామిలీ ఉంది. జీతం కూడా తక్కువ. నా ఉద్యోగానికి ల్యాప్ టాప్ చాలా అవసరం కానీ నా దగ్గర లేదు. నేను మీకు అల్లు అర్జున్ కి పెద్ద అభిమానిని'' అంటూ ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన అల్లు శిరీష్.. ''అయ్యో.. బాధపడకు బ్రదర్‌, నీవు సంపాదిస్తున్నావు. మీ కుటుంబాన్ని పోషిస్తున్నావు. నా దగ్గర కొత్త ల్యాప్‌టాప్‌ ఉంది. సో.. నా సోని ల్యాప్‌టాప్‌ను నువ్వు తీసుకో.. నీ వివరాలు నాకు పంపు'' అంటూ సమాధానమిచ్చాడు.

అభిమాని కోరికని మన్నించి నెరవేరుస్తున్న శిరీష్ పై సోషల్ మీడియాలో ప్రసంశలు కురిపిస్తున్నారు. మరికొందరేమో.. మాకు కూడా ఐఫోన్ కావాలి, కార్ గిఫ్ట్ గా కావాలి..  అంటూ కొంటెగా ట్వీట్లు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios