టాలీవుడ్ లో హిట్టందుకోవాల్సిన కథానాయకులు చాలా మందే ఉన్నారు. అందులో అల్లు శిరీష్ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. మెగా సపోర్ట్ తో వచ్చిన ఈ స్టైలిష్ స్టార్ తమ్ముడు చేస్తోన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పడిపోతున్నాయి. కెరీర్ లో మొదటి సినిమానే బెడిసి కొట్టింది. 

శ్రీరస్తు శుభమస్తు కొంతవరకు పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నా లాభాలను అంతగా అందించలేదు. ఇక ఇప్పుడు ఈ హీరో ఒక మలయాళం రీమేక్ తో రాబోతున్నాడు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఏబీసీడీ అనే సినిమా వాలైంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అసలైతే సినిమాను మార్చ్ 1న రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. 

కానీ తేదీని మార్చ్ 21కు మార్చినట్లు తెలుస్తోంది. ఇక సిద్ శ్రీరామ్ తో ఒక లవ్ సాంగ్ ని పాడించారు. మెల్లమెల్లగా అనే ఆ సాంగ్ ఫిబ్రవరి 22న రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇప్పటివరకు తనకంటూ గుర్తింపు వచ్చేలా హిట్ తెచ్చుకోలేని అల్లు శిరీష్ ఈ సినిమాతో అయినా హిట్టందుకుంటాడో లేదో చూడాలి.