మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క వీడియోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. కొంటెగా కన్నుకొడుతూ, తన వాలుచూపులతో యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది.

అంతగా తనను ఫేమస్ చేసిన వీడియో 'ఒరు అడార్ లవ్' సినిమాలో ఒక పాటలోనిది. ఇప్పుడు ఆ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది. తెలుగులో 'లవర్స్ డే' పేరుతో సుఖీభవ సంస్థ విడుదల చేస్తోంది. ఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఒమర్ లులు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జనవరి 23న నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్లు  తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్రబృందం ప్రకటించింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.