స్క్రిప్టును మరింత కట్టుదిట్టంగా రెడీ చేసి మరీ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇప్పటికీ ఆ చిత్రం సృష్టించిన ప్రకంపనలు అంతర్జాతీయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2 పై అందరి దృష్టి నెలకొన్న నేపధ్యంలో పుష్ప 2 టీజర్ విడుదలకు రంగం సిద్దమైందని తెలుస్తోంది.
పుష్ప సినిమా భారీ విజయం సాధించడంతో పుష్ప 2పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్, ఆయన టీమ్ రాత్రింబవళ్లూ కష్టపడుతోంది. ఎక్సపెక్టేషన్స్ భారీగా పెరగడంతో అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. స్క్రిప్టును మరింత కట్టుదిట్టంగా రెడీ చేసి మరీ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
దాంతో కేవలం టీజర్ నే స్పెషల్ గా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. టీజర్ పైనే కోట్లు ఖర్చు పెట్టి, ప్రత్యేకమైన షాట్స్ తో అదిరిపోయేలా..తీర్చిదిద్దుతున్న సమచారం. ఈ టీజర్ రిలీజ్ తర్వాత మొత్తం బిజినెస్ క్లోజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఇంత అద్బుతంగా తయారైన టీజర్ ఎప్పుడు లాంచ్ చేస్తారు అంటే..
అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రియల్ 8 వ తేదీ. ఆ రోజు నిఈ సందర్భాన్ని పురస్కరించుకుని పుష్ప 2 టీజర్ లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ఈ టీజర్ లో బన్నీ మాత్రం స్టన్నింగ్ లుక్‌తో కన్పించనున్నాడని తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలోని డైలాగులు, మేనరిజమ్స్ ,పాటలు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెలబ్రెటీల నుండి క్రికెటర్స్, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా డైలాగ్స్, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు పార్ట్ 2 కు అంతకు మించి ఉండే అవకాసం ఉంది.
