Asianet News TeluguAsianet News Telugu

సుకుమార్ లేకపోతే నాకులైఫ్ లేదు అల్లు అర్జున్. సుక్కు సీక్రేట్ విప్పేస్తానంటూ బెదిరించిన బన్ని

సుకుమార్ లేకపోతే తాను లేను అన్నారు అల్లు అర్జున్. 18 పేజెస్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన ఆయన ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. 

Allu Arjun Speech at 18 Pages Movie Pre release Event
Author
First Published Dec 19, 2022, 11:09 PM IST


18 పేజెస్ ప్రిరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు. షాట్ అండ్ స్వీట్ స్పీచ్ తో అందరిని ఆకట్టకున్నారు బన్నీ. ఇక ఈ ఈవెంట్ ల్ సుకుమార్ ను పొగడ్తలతో ముంచెత్తారుబన్నీ.  సుకుమార్ లేకపోతు తాను లేనని. ఈ మూవీ కెరీర్ తను ఇచ్చిందే అన్నారు. అందకే సినిమా లేట్ అయినా నా నుంచి సుకుమార్ కు ప్రజర్ ఉండదు అన్నారు. సుకుమార్ శిష్యుడు డైరెక్ట్ చేయడం.. సుక్కు నిర్మాతగా కూడా ఉండటంతో.. ఈమూవీ తనకు ఎంతో స్పెషల్ అన్నారు అల్లు అర్జున్. ఇక సుకుమార్ కు  ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానన్నారు బన్నీ. 

ఈ ఈవెంట్ కు రావడానికి కూడా తన హృదయానికి దగ్గరగా ఉన్న సుకుమార్, బన్ని వాసు లాంటి వారికోసమే తాను వచ్చానన్నారు. 
పుష్ప2 గురించి అప్ డేట్ అడుగుతున్నారంటూనే.. సుకుమార్ కు  కాస్త నవ్వుతూనే చురకలు కూడా అంటించారు బన్నీ. త్వరగా అప్ డేట్ ఇవ్వకపోతే.. ఆ సినిమాలో డైలాగ్స్ అన్నీ చెప్పేస్తానన్నారు. త్వరంలో పుష్ప2 అప్ డేట్ వస్తుందన్నారు. ఇక 18 పేజెస్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా బాగుంటుందన్నారు. ముఖ్యంగా మ్యూజిక్ అందించిన గోపీ సుందర్ ను కూడా పొడగ్తలతో ముంచెత్తారు బన్నీ. ఫ్యూచర్ లో తన సినిమాకు వర్క్ చేయాల్సిందిగా బన్నీ ఆఫర్ కూడా ఇచ్చారు. 

ఇక డైరెక్టర్ ప్రతాప్  గురించి మాట్లాడుూ .. ఈ దర్శకుడికిఓపిక ఎక్కువా.. ఒక సినిమా చేయగానే.. వెంటనే మరో సినిమా అనకుండా.. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. నా సినిమాలకు అసిస్టెంట్ గా చేసిన ప్రతాప్.. కుమారీ 21 ఎఫ్ తో  అద్భుతమైన హిట్ కొట్టాడు. వెంటనే తొందరపడకుండా.. మళ్ళీ మంచి సినిమాతో రాబోతున్నాడన్నారు బన్ని. ఇక హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ గురించి కూడా మాట్లాడారు బన్నీ. నిఖిల్ ఇలాంటి మంచి కథలను ఎలా సెక్ట్ చేసుకుంటాడు అని తనకు ఎప్పుడూ అనుమానం ఉండేదన్నారు. ఒక పార్టీలో కూడా అడిగాన్నారు. తన ఇంట్లో మంచి లైబ్రరీ ఉంది. పుస్తకాలు చడవండం వల్లే హీరోగా నిఖిల్ మంచి నిర్ణయాలు తసుకుంటున్నాడు. అసలు హీరోకి ఉండవల్సిన లక్షణం అదిఅన్నారు బన్ని. 

నిఖిల్ ను హ్యాపీడేస్ అప్పటి నుంచీ గమనిస్తున్నారు. అతను మంచి యాక్టర్ తో పాటు తెలివైన వాడు అన్నారు. ఇక కార్తికేయా 2 తో పాన్ ఇండియా హీరో అయ్యాడు దానికి నిఖిల్ కి కంగ్రాట్స్ తెలిపారు బన్నీ. ఇక అనుపమను ఫన్నీగా పలకరించిన బన్నీ.. అడిగి మరీ హాయ్ చెప్పించుకున్నాడు. తన సొంత ఓటీటీ సంస్థ ఉన్నా కానీ.. సినిమా అనేది థియేటర్లోనే ప్రేక్షకులను అలరించాలి అని కోరకునే.. మంచి ప్రోడ్యూసర్ తన తండ్రి అల్లు అరవింద్ అని అన్నారు అల్లు అర్జున్. 


 

Follow Us:
Download App:
  • android
  • ios