బాలీవుడ్ లో సౌత్ హీరోలు అడుగుపెట్టడం అనేది చాలా రేర్. డబ్బింగ్ సినిమాల రూపంలో ఇప్పుడిపుడే అక్కడ ఫెమస్ అవుతున్నారు. ఇక యూ ట్యూబ్ లో మన మాస్ హీరోలకు నార్త్ జనాలు ఫిదా అవుతున్నారు. బన్నీకి కూడా బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. మనోడి ఎనర్జీకి స్టార్ హీరోలు సైతం ఫ్యాన్స్ గా మారారు. 

అయితే బాహుబలి తరువాత బాలీవుడ్ టెక్నీషియన్స్ టాలీవుడ్ లో కొంత మంది హీరోలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కరెక్ట్ గా ఒక మాస్ కథతో వారిని బాలీవుడ్ కి పరిచయం చేయిస్తే మంచి లాభాలను అందుకోవచ్చని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందులో అల్లు అర్జున్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారట. 

బన్నీ కూడా కొత్త తరహా ప్రయోగాలకు ఎప్పుడు ముందుంటాడు. ఇప్పుడు బాలీవుడ్ లో కొన్ని కథలను వినేందుకు బన్నీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే బన్నీతో చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే వేణు శ్రీరామ్ తో ఐకాన్ - సుకుమార్ తో ఒక సినిమా చేయనున్నాడు. వీటి తరువాత బన్నీ తప్పకుండా ఒక బాలీవుడ్ సినిమా చేయనున్నాడని ఇన్ సైడ్ టాక్.