Asianet News TeluguAsianet News Telugu

నేను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నా: అల్లు అర్జున్

ప్రపంచం మొత్తం చుట్టేసిన అల్లు అర్జున్ ని షాక్ కు గురి చేసే సంఘటన ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా.. ఉంది.. అది మరేదో కాదు తన కొడుకు విషయం. 

Allu Arjun shocked about his Fother gift to Ayaan
Author
Hyderabad, First Published Apr 4, 2019, 10:52 AM IST

ప్రపంచం మొత్తం చుట్టేసిన అల్లు అర్జున్ ని షాక్ కు గురి చేసే సంఘటన ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా..ఉంది..అది మరేదో కాదు తన కొడుకు విషయం. కొడుకుల సాహసాలు, సరదాలు ఎప్పుడు తండ్రులకు ముద్దే...ఆశ్చర్యమే...అప్పుడప్పుడే షాకే. అయితే ఈ సారి తన తండ్రి తన కొడుక్కు ఇచ్చిన గిప్ట్ చూసి బన్ని షాక్ అయ్యారట. ఇంతకీ ఏం గిప్ట్ ఇచ్చారు..ఎప్పుడు ఇచ్చారు అంటారా....

అల్లు అర్జున్ కుమారుడు అయాన్ తన ఐదో పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఎప్పటిలాగే అభిమానులతో పాటు...తల్లి తండ్రులైన  బన్నీ, ఆయన సతీమణి స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా  శుభాకాంక్షలు తెలిపారు.  అయితే అల్లు అర్జున్ తన ముద్దుల కొడుకుకి విషెష్ చెప్పటం మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని మనతో షేర్ చేసుకున్నారు. అదేమిటంటే తన కుమారుడికి పుట్టిన రోజు కానుకగా  తాతయ్య అల్లు అరవింద్ ఇచ్చిన గిప్ట్ గురించి. 

‘మా నాన్న అయాన్‌కు పుట్టినరోజు కానుకగా స్విమ్మింగ్‌ పూల్‌ ఇచ్చారు. నేను ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నా. 45 రోజుల క్రితం ఏం కావాలని నాన్న అయాన్‌ను అడిగారు. పూల్‌ కావాలని అయాన్ చెప్పాడు. నాన్న సరే అని, కట్టించేశారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం. నాలుగో తరం పిల్లలు లక్కీ. వాళ్లని చూసి అసూయ వేస్తేంది. ఏదైతేనేం మేం దీనికి ‘అల్లు పూల్‌’ అని పేరు పెట్టాం’ అని పోస్ట్‌లో అల్లు అర్జున్  పేర్కొన్నారు. అలాగే తన పిల్లలు స్విమ్మింగ్‌ పూల్‌లో ఆడుతున్న ఫొటోలను షేర్ చేసారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios