కరోనా రాజ్యం ఏలుతున్న ప్రస్తుత పరిస్దితుల్లో సినిమావాళ్లంతా బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నారు. బిజినెస్ ఎలా ఉంటుందో..రిలీజ్ తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయో అర్దం కాక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత తక్కువలో సినిమాని పూర్తి చేద్దామని బడ్జెట్ కంట్రోలు విషయంలో కసరత్తులు చేస్తున్నారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్దలు కూడా అదే తీరులో వెళ్తున్నాయి. అయితే అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప విషయంలో మాత్రం రివర్స్ గేర్ లో వెళ్తున్నారని సమాచారం. 

తెలుగులో ఎక్కువగా మాట్లాడుతున్న చిత్రాలు ...ఆర్ ఆర్ ఆర్ ఆ తర్వాత పుష్ప. రీసెంట్ గా అల వైకుంటపురములో వంటి సూపర్ హిట్ ఇచ్చిన అల్లు అర్జున్ చిత్రం కావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై ఉంది. దానికి తోడు సుకుమార్ దర్శకుడు కావటం సినిమాపై అంచనాలు పెంచేసింది. అదే సమయంలో ఈ సినిమా బడ్జెట్ కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది. సినిమాపై నమ్మకం ఎలానో ఉంటుంది. అలా లేకపోతే ఇంత పెద్ద ప్రాజెక్టు మొదలెట్టరు. అయితే అదే సమయంలో ఈ సినిమాకు అవుట్ డోర్ షూటింగ్ అదీ అడవుల్లో తీస్తే మొదట అనుకున్న బడ్జెట్ లో అయ్యిపోతుంది. కానీ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఫారెస్ట్ సెట్ వేస్తున్నారు. 

ఏదో ఇంటి సెట్ వేస్తునంత ఈజీ కాదు అడవి సెట్ వేయటమంటే..ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు..తుప్పలు..తెచ్చి నాటాలి..ఆ లుక్ తీసుకురావాలి. అంటే చాలా అయ్యిపోతుంది. అలాగే అదే సమయంలో ఎంతచేసినా కొంత గ్రాఫిక్స్ లో మేనేజ్ చేయకతప్పదు. అదో అదనపడు బడ్జెట్. కానీ నిర్మాతలకు వేరే ఆప్షన్ లేదు. దాంతో బడ్జెట్ పెంచటానికే నిర్ణయంచుకున్నట్లు సమాచారం. ఎలాగో షూటింగ్ పూర్తయ్యి..రిలీజ్ నాటికి కోరనా పరిస్దితి చక్కబడుతుంది. థియోటర్స్ ఓపెన్ చేస్తారు. పరిస్దితిలు యధాస్దితికి వస్తాయి. కాబట్టి బిజినెస్ యాంగిల్ లో సమస్య  రాదు అని భావిస్తున్నారు. అందుకే బడ్జెట్ ని పెంచటానికే మైత్రీ మూవిస్ వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. 
 
 ‘అల వైకుంఠపురములో..’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న సినిమా ఇది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక హీరోయిన్. ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, వెన్నెల కిశోర్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా   నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ ‌స‌ంగీతం అందిస్తున్నాడు.  తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది.