Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ప-2’ హిందీ 1000 కోట్లు: 'కల్కి' ఖంగుతినేలా..?


2021లో విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తోంది.

Allu Arjun Pushpa 2 Speculation In Hindi 1000 crore? jsp
Author
First Published Aug 26, 2024, 2:44 PM IST | Last Updated Aug 26, 2024, 2:44 PM IST


 
నార్త్ లో మన సౌతిండియా సినిమాలు అదరకొడుతున్నాయి. కల్కి కలెక్షన్స్ తో మరోసారి ఆ విషయం ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు అందరి దృష్టీ పుష్ప 2  పై పడింది. ‘పుష్ప ది రైజ్’ మూవీ తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా దుమ్ము దులిపిన సంగతి తెలసిందే. బన్ని  కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు  జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది.. 

ఈ క్రమంలో  ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ  ఏడాది (2024) డిసెంబర్ 6వ తేదీన పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎంత రావచ్చు..మొదట రోజు ఓపినింగ్స్ ఎలా వస్తాయనే అంచనాలు అప్పుడే మొదలైపోయాయి. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసే అవకాసం ఉందనే విషయమై డిస్కషన్స్ మొదలయ్యాయి. టోటల్ గా ఎంత కలెక్ట్ చేయచ్చు అనే ట్రేడ్ లెక్కలు,అంచనాలు వేస్తోంది మీడియా. ముఖ్యంగా కల్కి చిత్రం 400 కోట్లు వసూలు చేసిన నేపధ్యంలో పుష్ప 2కు ఇంకెంత కలక్షన్స్ రాబోతున్నాయనేది ఆసక్తికరమైన డిస్కషన్ గా మారింది. 

మీడియా వర్గాల్లో ఉన్న డిస్కషన్స్ మేరకు పుష్ప 2 హిందీ వెర్షన్ 1000 కోట్లు దాకా నార్త్ లో వసూలు చేస్తుందని భావిస్తున్నారు.  సినిమా  మీద ఉన్న  హై ఎక్సపెక్టేషన్స్ నేపథ్యంలో మొదటి రోజు  హిందీ బెల్ట్ లో పుష్ప ది రూల్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం ఇది ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదు.  దాంతో గతంలో సౌత్ నుంచి వచ్చి నార్త్ లో  కలెక్షన్స్ దుమ్ము రేపిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. సౌత్ సినిమాలు హిందీ బెల్ట్ లో మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు అంటే టాప్ వన్ లో కేజీఎఫ్ చాప్టర్ 2 ఉంది. ఈ మూవీ ఏకంగా 52.39 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది . 

టాప్ 2 లో బాహుబలి 2 నిలిచింది. ఈ సినిమా 40.73 కోట్లు వసూళ్లు చేసింది. ప్రభాస్ సాహో మూవీ 25.82 కోట్లు మొదటి రోజు రాబట్టింది. రోబో 2.ఓ మూవీ 19.74 కోట్లు కలెక్ట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమాకి వచ్చింది. ఐకాన్ స్టార్ ఫ్యాన్ బేస్, పుష్ప ది రూల్ సినిమాపై ఉన్న హైప్ తో కచ్చితంగా నార్త్ ఇండియాలో 60 కోట్లకి పైగా మొదటి రోజు ఈ చిత్రానికి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios