Asianet News TeluguAsianet News Telugu

బన్నీ ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్.. గెట్ రెడీ బాయ్స్.. అల్లు అర్జున్ పుష్ప2 నుంచి సాలిడ్ అప్ డేట్..

ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ ను రెడీ చేస్తున్నాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. దానికి సబంధించి తాజాగా పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు టీమ్. 

Allu Arjun Pushpa 2 Movie Teaser Coming Soon New Poster Release JMS
Author
First Published Apr 2, 2024, 5:04 PM IST

పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు.  పుష్ప ఫస్ట్ పార్ట్ కు పాన్ ఇండియా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈసినిమాతో ఆయనకు అన్ని భాషల నుంచి ఫ్యాన్స్ తయారయ్యారు. ఇక పుష్ప2  కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. కాగా ఈ మూవీ నుంచి గత ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజుకి ఓ స్పెషల్ వీడియోని తీసుకు వచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేసారు. ఇక ఈసారి అంతకు మించి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. 

 

అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిటింగ్ కు తగ్గట్టుగా.. వారి కోసంస్పెషల్ ట్రీట్ ను రెడీ చేస్తున్నారు పుష్పటీమ్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. దీనికి సబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు టీమ్. అందులో అల్లు అర్జున్ నాట్యం చేసే కాలు.. కనిపించేలా డిజైన్ చేశారు టీమ్. అయితే టీజర్ రిలీజ్ కు కచ్చితమైన టైంని అనౌన్స్ చేయలేదు. ఇక ఈ టీజర్ అప్డేట్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్.. జాతర సాంగ్ కి సంబంధించిందని తెలుస్తుంది. 

జాతరలో అల్లు అర్జున్ అమ్మోరులా నాట్యం చేయనున్నారట. అలాగే ఆ బ్యాక్ డ్రాప్ లో ఓ అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈసారి 1000 కోట్లు కలెక్షన్స్ తో పాటు ఆస్కార్ టార్గెట్ గా ఈసినిమాను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం స్పెషల్ డైట్ ను కూడా ఫాలో అవుతున్నాడు అల్లు అర్జున్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios