Asianet News TeluguAsianet News Telugu

పోస్టర్ : బన్ని , దిల్ రాజు చిత్రం టైటిల్ ప్రకటన

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అర్థరాత్రి 12 గంటలకు కొత్త సినిమా అనౌన్స్మెంట్ చేసారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు

Allu Arjun new film titled Icon
Author
Hyderabad, First Published Apr 8, 2019, 9:44 AM IST

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అర్థరాత్రి 12 గంటలకు కొత్త సినిమా అనౌన్స్మెంట్ చేసారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.నానితో రీసెంట్ గా ఎంసీఏ చిత్రం డైరక్ట్ చేసిన శ్రీరామ్ వేణు దర్శత్వంలో అల్లు అర్జున్ హీరో గా ఈ చిత్రం తెరకెక్కనుంది. కనపడుట లేదు అనే టాగ్ లైన్ తో "ఐకాన్" టైటిల్ తో ఈ  సినిమా ప్రకటన వెలువడింది. 

ఈ టైటిల్ ఇమ్మీడియట్ గా సోషల్ మీడియాలో సంచలనం అయ్యింది. ఈ టైటిల్ , ట్యాగ్ లైన్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో దిల్ రాజు చాలా హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. ఇక వేణు శ్రీరామ్ చెప్పిన కథ చాలా కొత్తగా ఉందని, తెలుగు తెరపై అలాంటి కథను ఇప్పటివరకూ ఎవరూ చెయ్యలేదని చెప్తున్నారు. 

ఇక దిల్ రాజు అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇంతకు ముందు ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాధం సినిమాలు వచ్చాయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమా. త్రివిక్రమ్ దర్శకత్వం లో అల్లు అర్జున్ సినిమా ఈ నెలాఖరుకు ప్రారంభం కానుంది. ఇది కాకుండా సుకుమార్ సినిమా ఒకటి త్వరలో పట్టాలు ఎక్కబోతోంది.. గతేడాది నా పేరు సూర్య డిజాస్టర్ కావటం తో చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పటికే మూడు సినిమాలు లైన్ లో పెట్టుకుని తన కెరీర్ ని పరుగులెత్తిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios